రైతులకు మోడీ సర్కార్ శుభవార్త.. అక్టోబర్ చివరలో ఖాతాలో డబ్బులు జమ.. ఇలా చెక్ చేసుకోండి !

-

కేంద్రంలో అధికారం లో ఉన్న మోడీ సర్కార్ ఎన్నో రకాల పథకాలను ప్రజలకు అందిస్తోంది. ఈ స్కీమ్స్ కారణంగా చాలా మంది ప్రజలు లబ్ధి పొందుతున్నారు. ఇంకా తెలంగాణ రాష్ట్రంలోనీ రైతు బంధు తరహాలోనే… మోడీ సర్కార్ కూడా పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన అనే పథకాన్ని తీసుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ పథకం ద్వారా రైతులకు ప్రతిఏటా రూ. 6000 జమ చేస్తోంది కేంద్ర ప్రభుత్వం. అయితే ఈ డబ్బులు ఒకేసారి కాకుండా విడతలవారీగా జమ చేస్తోంది కేంద్ర ప్రభుత్వం.

ఈ నేపథ్యంలోనే రైతులకు మోడీ సర్కార్ శుభవార్త చెప్పింది. ఇప్పటికే తొమ్మిది విడుదల డబ్బును రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ చేసిన కేంద్ర ప్రభుత్వం… పదో విడత కూడా చెల్లించాలని నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం అందుతోంది.

ఈ ఏడాది ఇప్పటికే రెండుసార్లు ఖాతాలో డబ్బులు జమ చేసిన కేంద్ర ప్రభుత్వం… చివరి విడత కూడా జమ చేయనుంది. అక్టోబర్ 31 వరకు… పీఎం కిసాన్ పథకం కింద రైతులకు రెండు వేలు జమ చేయాలని… సన్నాహాలు చేస్తోంది కేంద్ర ప్రభుత్వం. తాగా పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన డబ్బులు తెలుసుకునేందుకు… Http://pmkishan.gov.in/ అనే వెబ్సైట్ ద్వారా చెక్ చేసుకోవచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news