ఈ రోజు ప్రధాని నరేంద్ర మోదీ తెలంగాణ ఎన్నికల ప్రచారంలో భాగంగా తుక్కుగూడ బహిరంగ సభలో ప్రజలతో మాట్లాడారు. మోఢీ మాట్లాడుతూ రెండు సార్లు కేసీఆర్ ను గెలిపించి మీరు ఎంత బాధపడుతున్నారో మాకు స్పష్టంగా అర్ధమవుతోంది, అందుకే ఈసారి మీ ఎంపిక కేవలం బీజేపీ కావాలి అంటూ మోదీ ప్రజలను అడిగారు. రానున్న ఎన్నికల్లో బీజేపీని మీరు కనుక గెలిపిస్తే పెట్రోల్ మరియు డీజిల్ పై వ్యాట్ ను తగ్గిస్తామంటూ హామీ ఇచ్చారు మోదీ. మీరు ఒకటి గమనించండి బీజేపీ అధికారంలో ఉన్న ఏ రాష్ట్రంలో అయినా సరే పెట్రోల్ డీజిల్ ధరలు తక్కువగా ఉంటాయి అంటూ మోదీ ఉదాహరణతో సహా చెప్పారు. అదే మీరు కాంగ్రెస్ పాలిస్తున్న రాష్ట్రాలలో చూస్తే పెట్రోల్ డీజిల్ ధరలలో పెరుగుదలే కానీ తగ్గడం అంటూ కనిపించాడని మోదీ చెప్పారు. కేంద్ర ప్రభుత్వం సుంకాలు తగ్గించుకుంటున్నా రాష్ట్ర ప్రభుత్వాలు మాత్రం తగ్గించడకుండా ప్రజలకు భారంగా మారుతోంది.
ఇక మోదీని ప్రజలు తెలంగాణాలో గెలిపిస్తారా లేదా అస్సలు పట్టించుకోకుండా వదిలేస్తారా అన్నది తెలియాల్సి ఉంది.