నాయకుల గురించి ప్రజలు ఏమనుకుంటారు.. ? అంటే ముందు ఒకమాట.. తర్వాత మరో మాట వినిపిస్తుంది. నాయకుల ముందు మీ అంత వాడు లేరంటారు.. మీరు లేక పోతే మా బతుకే లేదని కూడా చెబుతారు. మీరు చాలా చేస్తున్నారని కూడా కితాబు ఇస్తారు. మీరు ఉండబట్టే ఈ కార్యక్రమాలు జరిగాయని కూడా చెబుతారు. మీరు మాకు ఎంతో సేవ చేస్తారని , చేస్తున్నారని కూడా పొగడ్తల వర్షం కురిపిస్తారు. కానీ, నాయకుడు అలా వెళ్లగానే.. ఇలా ఆయనపై విమర్శలు గుప్పిస్తారు. నియోజకవర్గంలో గెలిచిన తర్వాత.. కనీసం మాకు మొహం కూడా చూపించలేదని అనే వారు చాలా మంది ఉన్నారు.
ఇక, గెలిచిన తర్వాత.. దోచుకో-దాచుకో స్కీం ను అవలంబిస్తున్నారని అనే వారు కూడా ఎక్కువగా ఉంటారు. కానీ, పాలేరు సిట్టింగ్ ఎమ్మెల్యే.. ప్రస్తుత బీఆర్ ఎస్ అభ్యర్థి.. కందాళ ఉపేందర్ రెడ్డి విషయం మాత్రం అలా కాదు.. ఆయనకు ముందు , ఆయన వెనుకాల కూడా ప్రజలు ఆయన సేవలను గుర్తు చేసుకుంటున్నారు. ముఖస్థతి మాత్రమే కాదు.. అదే రేంజ్‌లో ఆయన వెనుకాల కూడా.. అదే మాట చెబుతున్నారు. తాజాగా దీనికి సంబంధించి ఓ ఉదాహరణను కందాళ లైవ్‌లోనేబయట పెట్టారు.
ఇటీవల ఆయన మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. “ఏదులాపురం వరంగల్ క్రాస్ రోడ్డు నుంచి ఓ యువ కార్యకర్త పోన్‌చేశాడు. తాను ఇల్లు కట్టుకుంటున్నానని.. పునాదుల వరకు జరిగిందని.. కానీ, రేకులు వేసుకునేందుకు ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నానని చెప్పాడు. ఆర్థిక సాయం చేయాలని కోరాడు. నేను ఓకే చెప్పాను. చేస్తానన్నాను“ అని చెప్పారు. అయితే..దీనిపై అనుమానం వచ్చిన మీడియా ప్రతినిధి. వెంటనే సదరు కార్యకర్తకు అక్కడికక్కడే ఫోన్ చేశారు.
ఈ ఫోన్‌లో మీ ఎమ్మెల్యేను కలిశారా? మీరు సాయం కోరారా? చేస్తానని ఆయన హామీ ఇచ్చారా? అని ప్రశ్నించారు. అంతేకాదు.. ప్రస్తుతం ఎన్నికల సీజన్ కాబట్టి ఆయన అలా చెప్పారా? నిజంగానే ఆయన ముందు నుంచి సాయం చేస్తున్నారా? అని ప్రశ్న ల వర్షం కురిపించారు. దీనికి సదరు కార్యకర్త.. ఆసక్తికర సమాధానం చెప్పారు. “ఔను సర్.. కలిశాను. ఆయన సాయం చేస్తానని చెప్పారు. ఇప్పుడు మాత్రమే కాదు.. గతంలో మాకుటుంబాన్ని.. మా అన్నదమ్ముల పిల్లలకు కూడా ఆర్థి క సాయం చేశారు. కందాళ వంటి నాయకుడు ముందు నుంచి అందరినీ ఆదుకుంటున్నారు. ఆయన సేవ చేయడంలో ముందుంటారు“ అని లైవ్‌లోనే నిజాలు చెప్పారు.
ఇలా ఫోన్ చేస్తున్నప్పుడు.. పక్కనే ఎమ్మెల్యే ఉన్నారన్న విషయం ఆయనకు తెలియక పోవడం గమనార్హం. అంటే.. ఎమ్మెల్యే ముందే కాదు.. ఆయన వెనకాల కూడా.. ప్రజలు ఆయన మంచిని ఎలా చెప్పుకొంటున్నారనేందుకు ఈ లైవ్ ఉదాహరణే ప్రధాన అంశమని అంటున్నారు పరిశీలకులు.