కొత్త సంవత్సరం ప్రారంభం రోజే జమ్మూకాశ్మీర్ లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. నూతన సంవత్సరం సందర్భంగా వైష్ణోదేవి ఆలయానికి భక్తులు భారీగా తరలి రావడంతో ఆలయంలో తొక్కిసలాట చోటు చేసుకుంది. తొక్కిసలాటలో 12 మంది భక్తులు ప్రాణాలు కోల్పోయారు. అదేవిధంగా 20 మంది భక్తులకు గాయాలయ్యాయి. వెంటనే పోలీసు అధికారులు క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. అంబులెన్సు సహాయంతో బాధితులను ఆస్పత్రికి తరలిస్తున్నారు.
ఆలయంలో ఒకరినొకరు నెట్టుకోవడం వల్ల ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనపై ఇప్పటికే ప్రధాని సంతాపం ప్రకటించిన సంగతి తెలిసిందే. అదేవిధంగా ప్రధాని నరేంద్ర మోడీ పిఎంఎన్ఆర్ఎఫ్ కింద మృతుల కుటుంబాలకు 2 లక్షల ఎక్స్ గ్రేషియా ప్రకటించారు. అదేవిధంగా ఈ ఘటనలో గాయపడిన వారికి 50 వేల ఎక్స్ గ్రేషియా ప్రకటించారు. అంతేకాకుండా జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా ఈ ప్రమాదంలో గాయపడిన కుటుంబాలకు 10 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించారు. గాయపడిన వారికి రెండు లక్షల ఎక్స్ గ్రేషియా ప్రకటించారు.