నేడు ఏపీకి ప్రధాని మోదీ.. రెండు కీలక సభలు

-

ప్రధాని నరేంద్ర మోదీ ఇవాళ ఏపీలో పర్యటించనున్నారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంతో పాటు అనకాపల్లి జిల్లాలో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. ముందుగా రాజమహేంద్రవరం లోక్‌సభ పరిధిలోని వేమగిరిలో మధ్యాహ్నం 3.30గంటలకు నిర్వహించనున్న బహిరంగ సభలో ప్రధాని పాల్గొంటారు. అనంతరం సాయంత్రం 5.40 గంటలకు అనకాపల్లి జిల్లా కశింకోట మండలం తాళ్లపాలెం సమీపంలో నిర్వహించనున్న సభకు హాజరవుతారు. ఈ కార్యక్రమంలో తెలుగు దేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్లు పాల్గొంటారు.

ప్రధాని ఇవాళ మధ్యాహ్నం ఒంటిగంట 35 నిమిషాలకు ఛత్తీస్‌గఢ్‌లోని జగ్దల్‌పూర్‌ ఎయిర్‌పోర్టు నుంచి ఐఏఎఫ్‌ ఎంబ్రే యర్‌ మీద బయలుదేరి 2.25 గంటలకు రాజమండ్రి విమానాశ్ర యానికి చేరుకుంటారు.

అక్కడి నుంచి 2.30 గంటలకు ఎం.ఐ 17 హెలికాప్టర్‌ మీద 2.50 గంటలకు వేమగిరిలో ఏర్పాటు చేసిన హెలి పాడ్‌కు వస్తారు.

అక్కడి నుంచి 2.55 గంటలకు రోడ్డు మార్గాన బయలుదేరి 3 గంటలకు సభావేదిక వద్దకు వస్తారు.

అక్కడ 3 గంటల నుంచి 3.45 గంటల వరకూ అంటే మొత్తం 45 నిమిషాల పాటు వేదిక మీద ఉంటారు.

అనంతరం ప్రత్యేక హెలికాప్టర్‌లో సాయంత్రం నాలుగు గంటలకు బయలుదేరి 4.50 గంటలకు అనకాపల్లి జిల్లా తాళ్లపాలెం చేరుకుంటారు.

అక్కడ నుంచి బహిరంగ సభా వేదిక వద్దకు చేరుకొని ప్రసంగిస్తారు.

సాయంత్రం 5.45 గంటలకు రోడ్డు మార్గంలో విశాఖపట్నం విమానాశ్రయానికి చేరుకొని అక్కడ నుంచి ప్రత్యేక విమానంలో అహ్మదాబాద్‌ వెళ్లనున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news