కల్యాణలక్ష్మి పథకానికి రాష్ట్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. 2024-25 ఆర్థిక సంవత్సరానికి రూ.725 కోట్లకు అప్రూవల్ ఇచ్చింది.ఈ మేరకు ప్రిన్సిపల్ సెక్రటరీ బుర్రా వెంకటేశం శనివారం ఉత్తర్వులు జారీ చేశారు.
పార్లమెంట్ ఎన్నికల కోడ్ పూర్తి కాగానే కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చిన 6 గ్యారంటీలలో భాగంగా కల్యాణ లక్ష్మి, తులం బంగారం స్కీమ్ అమలయ్యే అవకాశం ఉందని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. ఇదిలా ఉంటే, కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల ముందు కల్యాణ లక్ష్మి స్కీమ్ పేరిట గతంలో అందజేసిన ఆర్థిక సాయం తో పాటు తులం బంగారం కూడా ఇస్తామని వెల్లడించింది. దీనిపై సుదీర్ఘంగా కసరత్తు చేసిన ప్రభుత్వం, నిధులు మంజూరు చేసింది. ఈ పథకంతో కాంగ్రెస్ కు మంచి మైలేజ్ వచ్చే అవకాశం ఉందని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి.