లడఖ్‌ను కేంద్ర పాలిత ప్రాంతంగా ప్రకటించి దాదాపు సంవత్సరం అవుతున్న నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ ఆ ప్రాంతానికి ఓ బహుమతి ఇవ్వనున్నారు. లడఖ్‌లో మొట్ట మొదటి సెంట్రల్ యూనివర్శిటీ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అందులో ఓ ‘బౌద్ధ అధ్యయన కేంద్రాన్ని’ కూడా ఏర్పాటు చేయనున్నారు. ఇక ఆ యూనివర్శిటీ ఇంజనీరింగ్, వైద్య విద్య మినహా బేసిక్ సైన్సెస్ వంటి అన్ని కోర్సులలోనూ డిగ్రీలను అందించనుంది.
ఇక ఈ వర్శిటీ ఏర్పాటుపై కేంద్ర మానవ వనరుల శాఖ త్వరలోనే అఫీషియల్ గా ప్రపోజల్ తెస్తుందని, ఆపై క్యాబినెట్ ఆమోదం తరువాత బిల్లు పార్లమెంట్ మందుకు వస్తుందని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. లడఖ్ ప్రాంతంలో గడచిన ఏడాది కాలంలో జరిగిన అభివృద్ధి కార్యక్రమాలపై సమీక్షా సమావేశం నిర్వహించిన ప్రధాని, ఈ సమావేశంలోనే కొత్త వర్శిటీపై నిర్ణయం తీసుకున్నారు.