యూఏఈ పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్ర మోడీ ఆ దేశ అధ్యక్షుడు షేక్ మహ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్తో భేటీ అయ్యారు. ఇరు దేశాల బంధం బలోపేతంపై చర్చించుకున్నారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీకి ఘన స్వాగతం లభించింది. మోదీని చూసేందుకు అబుదాబిలో ఆయన బస చేసే హోటల్కు ప్రవాసులు భారీగా తరలివచ్చారు. ‘మోదీ.. మోదీ’, ‘భారత్ మాతాకీ జై’ నినాదాలతో ఆ ప్రాంతాన్ని హోరెత్తించారు.
ఇదిలా ఉంటే ….అబుదాబిలో నిర్మించిన అతి పెద్ద హిందూ దేవాలయము బుధవారం ప్రధాని చేతుల మీదుగా ప్రారంభం కానుంది.యూఏఈలో ఇదే తొలి హిందూ దేవాలయం కావడం విశేషం. మరోవైపు అబుదాబిలో భారీగా వడగండ్లతో కూడిన వర్షాలు పడుతుండడం తో రోడ్లపైకి నీరు వచ్చి చేరింది. వరద ప్రవాహంలో చాలా కార్లు కొట్టుకుపోయాయి. ఈ వర్షాల ఎఫెక్ట్ ప్రధాని నరేంద్ర మోడీ టూర్‌పై పడే అవకాశం ఉన్నట్లు కనిపిస్తోంది.