భారత్ చాలా గొప్ప దేశం అని ప్రజలే భారత్ యొక్క బలం అని ప్రధాని మోడి మన్ కి బాత్ ద్వారా తెలియజేశారు. రేడియోలో ప్రసారమయ్యే ఈ కార్యక్రమంలో పాల్గొన్న మోడీ అనేక అంశాలను ప్రస్తావించారు. ముందు కరోనా పై స్పందించిన ఆయన దేశానికి కరోనా వచ్చి ఆరు నెలలు అయ్యిందని గుర్తు చేశారు. కరోనా తో పోరాడేందుకు శాయశక్తులా కేంద్రం పోరాడుతుందని అందుకు ప్రజలు సహకరిస్తున్నారని ఆయన గుర్తు చేశారు. ఈ సంవత్సరం మనం చాలా సవాళ్ళు ఎదుర్కున్నామని అందులో కరోనా చాలా భయంకరమైన సవాల్ అని మోడీ అన్నారు. సవాళ్ళు వచ్చినప్పుడే మన బలం ఎంతో తెలుస్తుందని సవాళ్ల తర్వాత మనం మరింత బలంగా అవుతామని ఆయన అన్నారు.
ఇక 2020 విసిరిన రెండవ సవాల్ చైనా సమస్య అని చైనీయుల చర్యలు చాలా బాధాకరం అని ఆయన అన్నారు. లడక్‌లోకి వచ్చేందుకు యత్నించిన చైనా సైన్యానికి భారత సైన్యం తగిన బుద్ధి చెప్పిందన్నారు. మన సైనికులు 20 మంది చనిపోయినా వారి సోదరులను సైన్యానికి పంపుతామని తల్లి దండ్రులు చెబుతున్నారని ఆయన అన్నారు. అది మన దేశం అంటే అదే మన బలం అని ఆయన ప్రశంసించారు. ఎట్టి పరిస్థితుల్లో యుద్ధం సంభవించకుండా చూస్తామని భారత్ ది శాంతి మంత్రం అని ఆయన తెలిపారు. ప్రాంతీయ వస్తువులనే వాడమని వోకల్ ఫర్ లోకల్ విధానం ద్వారా… దేశానికి గొప్ప సేవ చేయాలని ఆయన కోరారు. ఈ సవాళ్లను ఎదుర్కొంటున్న ప్రజలంతా 2020 ఎప్పుడు అయిపోతుందని ఎదురు చూస్తున్నారని ఆయన తెలిపారు. కరోనాను ఎదుర్కునేందుకు ప్రజలు అందరూ కేంద్రానికి సహకరించాలని మాస్కూలు స్యానిటైజర్లు వాడాలని సోషల్ డిస్టెన్స్ పాటించాలని ఆయన ప్రాజలను కోరారు.