ప్రధానమంత్రి జనధన్ యోజన ప్రారంభమై ఆరేళ్లు పూర్తయిన సందర్భంగా ఆ పథకంపై ప్రశంసలు కురిపించారు ప్రధాని నరేంద్ర మోదీ. ఈ పథకంతో గ్రామీణ ప్రాంతాల్లోని కోట్లాది మంది పేదలకు లబ్ధి చేకూరిందని ట్వీట్ చేశారు. ఇందుకు సంబంధించిన కొన్ని ఇన్ఫోగ్రాఫిక్స్‌ను కూడా పోస్టు చేశారు.
బ్యాంకింగ్ సేవలు అందరికీ అందుబాటులోకి తేవాలనే లక్ష్యంతో ఆరేళ్ల క్రితం పీఎం-జన్‌ధన్‌యోజనను ప్రారంభించాం. దీని ద్వారా సమూల మార్పులొచ్చాయి. పేదరిక నిర్మూలన కార్యక్రమాలకు ఈ పథకం పునాదిలా మారింది. కోట్లాది మంది ప్రజలకు లబ్ధి చేకూరింది. ఎన్నో కుటుంబాల భవిష్యత్తుకు భరోసా లభించింది. దీని ద్వారా ప్రయోజనం పొందినవారిలో ఎక్కువ మంది గ్రామీణ ప్రాంతాల ప్రజలు, మహిళలు ఉన్నారు. ఈ పథకం విజయం కోసం నిర్విరామంగా శ్రమించిన ప్రతిఒక్కరికీ ధన్యవాదాలు అని ప్రధాని మోదీ అన్నారు.
Today, six years ago, the Pradhan Mantri Jan Dhan Yojana was launched with an ambitious aim of banking the unbanked. This initiative has been a game-changer, serving as the foundation for many poverty alleviation initiatives, benefitting crores of people. #6YearsOfJanDhanYojana pic.twitter.com/MPueAJGlKw
— Narendra Modi (@narendramodi) August 28, 2020
దేశంలోని ప్రతిఒక్కరికి బ్యాంకింగ్ సేవలు అందుబాటులోకి తేవాలనే లక్ష్యంతో 2014 ఆగస్టు 15న పీఎం-జన్‌ధన్ యోజనను ప్రారంభించారు మోదీ. 2015 ఆగస్టు నాటికి ఈ బ్యాంకు ఖాతాల సంఖ్య 17.90కోట్లుగా ఉండగా.. 2020 ఆగస్టు నాటికి ఆ సంఖ్య 40.35 కోట్లను దాటింది.ఈ పథకం ద్వారా ప్రతి ఒక్కరు జీరో బ్యాలెన్స్ అకౌంట్ తెరవచ్చు. ఎలాంటి రుసుములు ఉండవు. ఉచితంగా డెబిట్ కార్డు పొందవచ్చు. ఖాతాదారులకు రూ.2లక్షల ప్రమాద బీమా వర్తిస్తుంది.