సుందర్ పిచాయ్ తో ప్రధాని మోదీ వీడియో కాన్ఫరెన్స్ …!

-

ప్రస్తుత గూగుల్ సంస్థ సీఈవో సుందర్ పిచాయ్ తో దేశ ప్రధాని మోదీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పలు అంశాలపై కీలక చర్చలు జరిపారు. ముఖ్యంగా ప్రస్తుతం ప్రపంచం కరోనా వైరస్ తో ఎదుర్కొంటున్న సమస్యల గురించి, కార్పొరేట్ ఆఫీసులలో కొత్త వర్క్ కల్చర్ లాంటి మొదలగు అంశాలపై వారు ఈ సమావేశంలో చర్చించారు. ప్రస్తుత టెక్నాలజీ మనుషుల జీవితాల పై ఎలా ప్రభావం చూపుతుందన్న విషయంపై కూడా సమాలోచనలు చేసినట్లు అర్థమవుతోంది. వీటితోపాటు సైబర్ సేఫ్టీ, డేటా సెక్యూరిటీ లాంటి అంశాలపై సుదీర్ఘ చర్చ జరిపినట్టు ప్రధాని మోదీ ట్వీట్ ద్వారా విషయాన్ని తెలియజేశారు.

pm sundhar

వీటితో పాటు డిజిటల్ ఇండియా, విద్య, డిజిటల్ పేమెంట్ సహా వివిధ రంగాల్లో గూగుల్ సంస్థ అందిస్తున్న సేవలు గురించి తెలుసుకోవడం చాలా సంతోషంగా ఉందని ప్రధాని మోదీ తెలియజేశారు. అలాగే గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ మాట్లాడుతూ… ముందుగా తనతో సమయం కేటాయించినందుకు ప్రధాని మోదీ కి ధన్యవాదాలు తెలియజేశారు. అలాగే డిజిటల్ ఇండియా పట్ల ప్రధాని విజన్ చాలా గొప్పదని ఆయన అన్నారు. డిజిటల్ ఇండియా నేపథ్యంలో గూగుల్ ఇండియా సంస్థ త్వరలో తీసుకోబోయే కార్యక్రమాలను నేడు ట్విట్టర్ ద్వారా వెల్లడిస్తామని సుందర్ పిచాయ్ తెలియజేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version