మోడీ, కేసీఆర్ ఒక్కటే : ఖర్గే

-

మోడీ, కేసీఆర్ ఒక్కటే.. వారిద్దరికీ పేదల కష్టాలు పట్టవు అని మల్లికార్జున ఖర్గే పేర్కొన్నారు. రైతులకు న్యాయం చేయడమే ఇందిరమ్మ రాజ్యం. దేశంలో ఆహార దాన్యాల కొరత తీర్చింది ఇందిరమ్మనే. హరిత విప్లవం ద్వారానే ఆహార ధాన్యాల కొరత తీరింది.
కేసీఆర్ ఇందిరాగాంధీని తిడుతున్నారు. పేదరిక నిర్మూలన కోసం ఇందిరమ్మ ఏం చేయలేదన్న వ్యాఖ్యలను ఖండిస్తున్నామని తెలిపారు ఖర్గే.

రైతులకు న్యాయం చేయడమే ఇందిరమ్మ రాజ్యం అని పేర్కొన్నారు ఖర్గే. రాహుల్ గాంధీ ప్రధానమంత్రి దేశం బాగుపడుతుందన్నారు. సోనియాగాంధీ తెలంగాణను ఇచ్చింది. నాగార్జున సాగర్ లేకుంటే తెలంగాణ ఎలా ఉండేది. కాంగ్రెస్ హయాంలోనే తెలంగాణ అభివృద్ధి జరిగిందని తెలిపారు. ప్రతీ ఒక్కరిపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ 1,40,000 అప్పు చేశారని తెలిపారు. హరిత విప్లవం, శ్వేత విప్లవం వచ్చినప్పుడు కేసీఆర్ ఎక్కడ ఉన్నారని ప్రశ్నించారు. తెలంగాణలో అవినీతి పెరిగిపోయిందన్నారు. తెలంగాణలో 2లక్షల పోస్టులు ఖాళీలున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news