ఐపిఎల్ 2024: అవేష్ ఖాన్ ను స్వాప్ చేసుకున్న రాజస్థాన్ రాయల్స్…!

-

ఐపీఎల్ సీజన్ కు ఇప్పటి నుండే ఫ్రాంచైజీలు ప్రణాళికలు రెడీ చేసుకుంటున్నాయి. ప్రతి సంవత్సరం జరిగే ఈ లీగ్ క్రికెట్ ప్రేమికులకు చాలా ఆనందాన్ని ఇస్తుందని ప్రత్యేకంగా చెప్పే అవసరం లేదు. ఇక గత సంవత్సరం ధోని సారధ్యంలోని చెన్నై సూపర్ కింగ్స్ టైటిల్ ను దక్కించుకుని తామేమిటో నిరూపించుకుంది. రానున్న సీజన్ లో ఎలాగైనా టైటిల్ అందుకోవాలని అన్ని ఫ్రాంచైజీలు ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇక మొదటి సీజన మినహా టైటిల్ ను దక్కించుకొని రాజస్థాన్ రాయల్స్ ప్రతిసారి ఫేవరెట్ గా బరిలోకి దిగుతున్నా ఛాంపియన్ గా నిలవడంలో ఫెయిల్ అవుతూ వస్తోంది. ఇక ఈ సీజన్ లో గట్టిగా పోరాడాలని భావించి జట్టులో ఒక కీలక మార్పును చేసింది.

అధికారికంగా తెలుస్తున్న సమాచారం ప్రకారం, రాజస్థాన్ రాయల్స్ లో ఓపెనర్ ప్లేయర్ గా ఉన్న దేవదత్ పడిక్కల్ ను స్వాపింగ్ ప్రక్రియ ద్వారా లుకనౌ సూపర్ జాయింట్స్ కు తరలించి, అతనికి బదులుగా ఫాస్ట్ బౌలర్ ఆవేశ ఖాన్ ను రాజస్థాన్ దక్కించుకుంది. మరి ఇతను రాజస్థాన్ విజయాలలో కీలక పాత్రా పోషిస్తాడా చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news