ఖమ్మం జిల్లాలో టిఆర్ఎస్ కీలక నేత మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఎపిసోడ్ తెలంగాణ రాష్ట్ర పాలిటిక్స్ లో హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. గత కొంతకాలంగా టిఆర్ఎస్ పార్టీకి దూరంగా ఉంటున్నా ఆయన ఆత్మీయ సమావేశాల పేరిట ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఉన్న అన్ని నియోజకవర్గాల్లో సభలు ఏర్పాటు చేస్తున్నారు.
ఈ సభల్లో బీఆర్ఎస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. టిఆర్ఎస్ అధిష్టానం తనను నమ్మించి మోసం చేసిందని, తన అనుచరులకు కూడా సరైన గౌరవం ఇవ్వలేదని మండిపడుతున్నారు. ఈ నేపథ్యంలో ఆయన పార్టీ మారటం ఖాయం అనే వార్తలు ఎప్పటినుంచో చక్కర్లు కొడుతున్నాయి.
అయితే తాజాగా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వైఎస్ విజయమ్మతో సమావేశం కావటం హాట్ టాపిక్ గా మారింది. వైయస్సార్ టిడిపిలో చేరికపై విజయమ్మతో మంతనాలు జరిపినట్లు తెలిసింది. ఈ నెల 8న పాలేరులో షర్మిల ప్రజా ప్రస్థానం పాదయాత్ర ముగింపు సభలో విజయమ్మ పాల్గొననున్నారు. ఆ సభ వేదికగా పొంగులేటి కారు దిగి షర్మిలమ్మతో కలిసి నడవనున్నారని తెలిసింది. ఇదే అంశంపై ఇప్పుడు పొలిటికల్ సర్కిల్ లో చర్చ నడుస్తోంది.