జబర్దస్త్ అభికి షాక్ ఇచ్చిన సైబర్ కేటుగాళ్ళు

జబర్దస్త్ అభి అలానే గడ్డం నవీన్ లకు సైబర్ నేరగాళ్ళు టోకరా వేశారు. వివరాల్లోకి వెళ్తే జబర్దస్త్ ఫేమ్ అభి హీరోగా , గడ్డం నవీన్ పాయింట్ బ్లాక్ అనే సినిమా నిర్మించారు. అయితే ఇంకా రిలీజ్ కూడా కాని ఈ పాయింట్ బ్లాక్ సినిమా ఆన్ లైన్ లో లీక్ అయింది. విడుదలకు ముందే ఆన్లైన్ లో దర్శనం ఇచ్చింది ఈ సినిమా. సోషల్ మీడియాలో కూడా ప్రత్యక్షం కావడంతో ఈ సినిమా మీద నిర్మాత గడ్డం నవీన్ సైబర్ క్రైం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.

తమకు తెలియకుండానే  ఇలా ఆన్ లైన్ లో లీక్ చేసిన వారి మీద చర్యలు తీసుకోవాలని ఆయన ఫిర్యాదు చేశాడు. ఈ సినిమా విడుదల హక్కులను అమెజాన్ ప్రైమ్.. ఆహ లకు ఇచ్చారు. ఫారెన్ లో ఈ సినిమాని అమెజాన్ ప్రైమ్ విడుదల చేసింది. దాని నుండి డౌన్ లోడ్ చేసిన కొన్ని యు ట్యూబ్ ఛానళ్ళు సినిమాని విడుదల చేసాయి.  ఈ సినిమా తెలుగులో ఈ వారంలో విడుదల కానుండగా సినిమా లీక్ అవ్వడంతో సినిమా విడుదలను వాయిదా వేశారు. అందరం కలిసి డబ్బు జమ చేసుకుని సినిమా తీశామని.. పోలీసులు స్పందించి సినిమాని పైరసీ నుంచి కాపాడాలని నిర్మాత అన్నారు.