రేవంత్ కి 4+4  సెక్యూరిటీ కల్పించిన పోలీసులు..

-

తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డికి పోలీసు శాఖ 4+4 భద్రతను కల్పించింది. తనను నేరుగా ఎదుర్కోలేక భౌతికంగా తుద ముట్టించేందుకు తెరాస వ్యూహరచన చేస్తుందని ఇటీవలే రేవంత్ తెరాస ప్రభుత్వంపై ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. దీంతో హైకోర్టు ఆదేశాల మేరకు రెండు ఎస్కార్ట్‌ వాహనాలతో భద్రతా సిబ్బందిని పోలీసుశాఖ సమకూర్చింది. అయితే ఈ సెక్యూరిటీ ఎన్నికల ఫలితాల వరకు ఆయనకు ఉంటుంది.  రేవంత్‌రెడ్డి భద్రత బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదేనని హైకోర్టు శుక్రవారం తేల్చిచేబుతూ.. ఆయనకు 4+4 భద్రతతో పాటు, 24 గంటల ఎస్కార్ట్‌ ఏర్పాటు చేయాలని న్యాయస్థానం రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.

ఇందుకయ్యే వ్యయాన్ని ప్రభుత్వమే భరించాలని వివరించింది. అయితే  రాష్ట్ర ప్రభుత్వం కల్పించే భద్రత వల్ల తన కదలికలను తెలుసుకునే అవకాశం ప్రభుత్వ పెద్దలకు ఉందని రేవంత్‌రెడ్డి ఆరోపిస్తున్న నేపథ్యంలో భద్రతా సిబ్బందిపై ఆయన ఏదైనా ఫిర్యాదు ఇస్తే దానిపై విచారణ జరిపి నివేదికను తమ ముందుంచాలని డీజీపీని ఆదేశించింది. తదుపరి విచారణను ఈ నెల 14కు వాయిదా వేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయ మూర్తి (సీజే) జస్టిస్‌ తొట్టతిల్‌ బి. రాధాకృష్ణన్, న్యాయమూర్తి జస్టిస్‌ ఎస్‌.వి. భట్‌లతో కూడిన ధర్మాసనం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.

Read more RELATED
Recommended to you

Latest news