అమ్మాయిలను ట్రాప్‌చేసి న్యూడ్‌ కాల్స్‌ .. నిందితులు అరెస్ట్

-

సైబర్‌ మోసాల ముఠా గుట్టురట్టు.. అమ్మాయిల ఫొటోలతో షేర్‌ చాట్‌ డీపీ. షేర్‌చాట్‌ యాప్‌లో మొదట మెస్సేజ్‌ చేసి.. తర్వాత అమ్మాయిల న్యూడ్‌ ఫొటోలతో బ్లాక్‌మెయిల్ చేసి బెదిరింపులకు పాల్పడి వసూళ్లకు పాల్పడ్డ ముఠా. అమ్మాయిల ఫొటోలతో షేర్‌ చాట్‌ డీపీ. షేర్‌చాట్‌ యాప్‌లో మొదట మెస్సేజ్‌ చేసి.. తర్వాత అమ్మాయిల న్యూడ్‌ ఫొటోలతో బ్లాక్‌మెయిల్ చేసి బెదిరింపులకు పాల్పడి వసూళ్లకు పాల్పడ్డారు. 18వేల మందికి కాల్స్‌ చేసి వసూళ్లు చేశారు.

 

నిందితుల నుంచి ఆరు మొబైల్​ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. మల్కాజిగిరి డీసీపీ జానకి సోమవారం ఘట్​కేసర్​పోలీస్​స్టేషన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు. గుంటూరు జిల్లా వట్టి చెరుకు మండలం కొర్రెపాడు గ్రామానికి చెందిన చొప్పర లక్ష్మీగణేశ్​(20) ఇంటర్​ఫెయిల్ అయి ప్రస్తుతం కూలీగా పని చేస్తున్నాడు. కాకినాడ టౌన్​నివాసి కొత్తగిరి వీరబాబు (20), చిట్టిబోయిన దుర్గారాజు (25) అతనికి ఇన్​స్టా స్నేహితులు. ఇదిలా ఉండగా ఈనెల 22న ఘట్​కేసర్​పోలీస్​స్టేషన్​పరిధిలోని ఓ ఇంజనీరింగ్​కాలేజీ ప్రిన్సిపల్​పోలీస్​స్టేషన్‌కు వచ్చి తమ కాలేజీలో చదువుతూ హాస్టల్‌లో ఉంటున్న కొంత మంది విద్యార్థినులకు అగంతకులు వాట్సాప్​కాల్స్​చేస్తూ వేధిస్తున్నట్టుగా ఫిర్యాదు చేశారు. దీనిపై కేసులు నమోదు చేసిన పోలీసులు మొబైల్​నెంబర్ల ఆధారంగా విచారణ చేయగా విజయవాడ, కాకినాడ నుంచి ఆ కాల్స్​వస్తున్నట్టు తేలింది. ఈ క్రమంలో ఆయా ప్రాంతాలకు వెళ్లిన పోలీసులు సోమవారం ముగ్గురు నిందితులను అరెస్టు చేశారు. చాకచక్యంగా దర్యాప్తు జరిపి నిందితులను అరెస్టు చేసిన ఘట్​కేసర్​సీఐ మహేందర్​రెడ్డి, ఎస్సైలు సుధాకర్, అశోక్, శ్రీకాంత్, హెడ్​కానిస్టేబుల్​శంకర్, కానిస్టేబుళ్లు రాజేశ్, నాగరాజు, ఆంజనేయులు, అరవింద్​లను డీసీపీ జానకీ అభినందించారు.

 

 

Read more RELATED
Recommended to you

Exit mobile version