ఆంధ్రప్రదేశ్ లో మే 13న లోక్ సభ, అసెంబ్లీ ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. దేశవ్యాప్తంగా 7 దశల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే 5 దశల్లో ఎన్నికలు ముగిసాయి. రేపు 06వ దశ ఎన్నికలు జరుగనున్నాయి. జూన్ 01న 7వ దశ ఎన్నికలు జరుగుతాయి. అయితే జూన్ 04న ఎన్నికల ఫలితాలు ఉన్నాయి.
ఏపీలో ఎన్నికల రోజే పలు చోట్ల వాగ్వాదాలు చోటు చేసుకున్నాయి. మాచర్ల నియోజకవర్గంలో పాల్వాయి గేట్ వద్ద ఎమ్మెల్యే పిన్నెల్లి ఈవీఎంను ధ్వంసం చేసిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ తరుణంలోనే సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణారెడ్డి మీడియాతో మాట్లాడారు. ఎన్నికలు సజావుగా నిర్వహించడంలో ఈసీ పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ నిర్వీర్యమైందని, పోలీసులు వైసీపీ కాపలా కుక్కలుగా వ్యవహరిస్తున్నారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. బదిలీ, సస్పెండ్ అయిన వెధవలు ఖాకీ డ్రెస్ లు వేసుకోవడానికి సిగ్గులేదా? అని మండిపడ్డారు. ఈవీఎంను పగలగొట్టిన పిన్నెల్లిని పట్టుకోలేని అసమర్థులు పోలీసులు అని దుయ్యబట్టారు. పోలీసులు వైసీపీ కాపలా కుక్కలుగా వ్యవహరిస్తున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణారెడ్డి.