తిరుపతిలో మీడియాపై లాఠీచార్జ్ చేసిన పోలీసులు

-

2024 అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఏపీలో అల్లర్లు చెలరేగుతున్నాయి. ముఖ్యంగా పల్నాడు, తిరుపతి, తాడిపత్రిలో టీడీపీ, వైసీపీ నేతల వ్యవహారం చూస్తుంటే పచ్చగడ్డి వేస్తే బగ్గు మనేలా తయారయింది. ఆ తీర్లో ఒకరిపై మరొకరు దాడులు చేసుకుంటున్నారు.

చంద్రగిరి ఎమ్మెల్యే , తెలుగుదేశం పార్టీ అభ్యర్థి పులిపర్తి నానిపై.. తిరుపతిలోని పద్మావతి యూనివర్సిటీ వద్ద వైసీపీ నేతలు దాడులు చేశారు. దీంతో ఆగ్రహించిన టీడీపీ నేతలు వెంటనే అక్కడికి చేరుకుని తమ నేతపై చేసిన దాడికి వ్యతిరేకంగా యూనివర్సిటీ ముందు బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. ఈ సమాచారం అందుకున్న పోలీసులు, మీడియా సిబ్బంది హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకున్నారు.అయితే తెలుగుదేశం పార్టీ, వైసీపీ శ్రేణులు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకోవడంతో ఘర్షణ వాతావరణం నెలకొంది.దీంతో పరిస్థితులను అదుపు చేసేందుకు పోలీసులు లాఠీ ఛార్జ్ చేశారు. ఈ క్రమంలో అక్కడే ఉన్న మీడియా ప్రతినిధులపై కూడా పోలీసులు లాఠీ జులిపించారు. దీంతో స్థానిక సీఐ దురుసు ప్రవర్తన ను నిరసిస్తూ మీడియా ప్రతినిధులు ఆందోళన చేపట్టడంతో పరిస్థితి ఒక్కసారిగా గందరగోళంగా మారిపోయింది.

Read more RELATED
Recommended to you

Latest news