ఏపీలో తాజా ఘటనలపై డీజీపీతో మాట్లాడిన టీడీపీ అధినేత

-

ఆంధ్ర ప్రదేశ్ లో మాచర్ల, చంద్రగిరి, తాడిపత్రి ఘటనలపై డీజీపీతో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు మాట్లాడారు. టీడీపీ కార్యకర్తలు, వారి ఆస్తులపై వైసీపీ వరుస దాడులు, విధ్వంసాలపై తక్షణం చర్యలు తీసుకోవాలని చంద్రబాబు విజ్ఞప్తి చేశారు.

పోలింగ్ ముగిసిన తర్వాత ప్రణాళికాబద్ధంగా మాచర్లలో వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి దాడులకు పాల్పడుతున్నాడని చంద్రబాబు నాయుడు ఫిర్యాదు చేశారు. మాచర్లలో వందల మంది ప్రైవేటు సైన్యంతో జరుగుతున్న దాడులను అరికట్టడానికి అదనపు బలగాలను పంపాలని చంద్రబాబు కోరారు. అన్ని గ్రామాల్లో పోలీస్ పికెట్లు ఏర్పాటు చేయాలని, దాడులకు పాల్పడుతున్న వారిని అరెస్టు చేయాలని ఆయన కోరారు. అనేక జిల్లాల్లో పోలింగ్ అనంతరం జరుగుతున్న దాడులను ప్రస్తావించి.. లా అండ్ ఆర్డర్ పరిరక్షణకు తక్షణ చర్యలు తీసుకోవాలని డీజీపీకి టిడిపి అధినేత విజ్ఞప్తి చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news