Jani Master: హైదరాబాద్‌ కు వచ్చిన జానీ మాస్టర్‌..సీక్రెట్‌ ప్రదేశంలో విచారణ

-

Jani Master: హైదరాబాద్‌ కు వచ్చారు జానీ మాస్టర్‌. కాసేపటి క్రితమే… జానీ మాస్టర్ ను హైదరాబాద్ తీసుకొచ్చారు పోలీసులు. గోవాలో నిన్న జానీ మాస్టర్ ని అరెస్ట్ చేశారు సైబరాబాద్ పోలీసులు. గోవా కోర్టు అనుమతితో హైదరాబాద్‌ కు జానీ మాస్టర్ను తీసుకు వచ్చారు పోలీసులు. జానీ మాస్టర్ ను రహస్య ప్రాంతంలో నుంచి విచారిస్తున్నారు పోలీసులు.

Police brought Johnny Master to Hyderabad

లైంగిక వేధింపులు కేసులో జానీ మాస్టర్ ను అరెస్ట్ చేసిన పోలీసులు.. ఇవాళ జానీ మాస్టర్ ని కోర్టులో హాజరు పరిచనున్నారు. ఇక అటు జానీ మాస్టర్ బాధితురానికి భద్రత పెంచారు పోలీసులు. సెప్టెంబర్ 15న జానీ మాస్టర్ పై కేసు నమోదు కావడం జరిగింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు జానీ పై మొదట మూడు సెక్షన్ల కింద కేసు నమోదు అయింది. బాధితురాలు స్టేట్మెంట్ రికార్డు తర్వాత జానీ పై పోక్సో కేసు నమోదు చేశారు పోలీసులు. జానీ పరారీ లో ఉన్నాడు అంటున్న పోలీసులు…జానీ మాస్టర్ బాధితురానికి భద్రత పెంచారు.

Read more RELATED
Recommended to you

Latest news