నగరంలో కార్పొరేట్ స్కూళ్ల విద్యార్థులకు ఈ-సిగరెట్స్ అమ్ముతున్న ముఠాను నార్కోటిక్ బ్యూరో పోలీసులు పట్టుకున్నారు.జూబ్లీహిల్స్,బంజారాహిల్స్, మాదాపూర్, గచ్చిబౌలి, కొంపల్లి ప్రాంతాల్లో విద్యార్థులే లక్ష్యంగా మత్తు మందు కలిపిన ఈ-సిగరెట్స్ విక్రయిస్తున్న నిందితుల గుట్టురట్టు చేశారు పోలీసులు.
మెుదట విద్యార్థుల తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు పోలీసులు. స్టూడెంట్స్‌ను ఫోన్ల ద్వారా డైరెక్టుగా కాంట్రాక్టు చేస్తున్న పాతబస్తీకి చెందిన జాఫర్‌ను నిందితుడిగా గుర్తించారు. ఫోన్ల ద్వారా విద్యార్థులను కలుస్తున్న జాఫర్ వారికి మత్తుమందు కలిసిన సిగరెట్లను అమ్ముతున్నాడని నిర్డారించారు. అనంతరం అతణ్ని పాతబస్తీలో అరెస్టు చేశారు. నిందితుడు ఇచ్చిన సమాచారం మేరకు ముఠా సభ్యులను కూడా అరెస్టు చేశారు. వారి నుంచి రూ.లక్ష విలువైన 55బాక్సుల్లోని 538 ఈ-సిగరెట్లను సీజ్ చేశారు.