తెలంగాణకు చెందిన గ్రూప్ 2 అభ్యర్థి మర్రి ప్రవల్లిక ఆత్మహత్య చేసుకుని మరణించిన సంగతి తెలిసిందే. వాస్తవాలను తెలుసుకునే పనిలో రంగంలోకి దిగిన హైద్రాబాద్ సెంట్రల్ జోన్ డీసీపీ వెంకటేశ్వరరావు అండ్ టీం నిజాలను నిగ్గుతేల్చింది. మర్రి ప్రవల్లిక వరంగల్ జిల్లా బిక్కజీ పల్లికి చెందిన అమ్మాయి కాగా అశోక్ నగర్ లోని బృందావ గర్ల్స్ హాస్టల్ లో గ్రూప్స్ కోచింగ్ కోసం రెండు వారల క్రితమే జాయిన్ అయినట్లు పోలీసులు చెప్పారు. నిన్న రాత్రి పోలీసులు ప్రవల్లిక స్నేహితులు శృతి మరియు సంధ్యలను విచారించగా, వారు ప్రవల్లిక ఒక్కటే రూమ్ లో ఉన్న సమయంలో ఫ్యాన్ కు చున్నీతో ఉరి వేసుకుని మరణించిందని తెలిపారట. ఇక ప్రవల్లిక రాసిన సూసైడ్ నోట్ ను మరియు మొబైల్ లో ఒక చాట్ ను పోలీసులు గమనించారట. ఈ చాటింగ్ లో కోస్గి మండలానికి చెందిన శివరాం తో మాట్లాడినట్లుగా తెలుసుకున్నారు పోలీసులు. చనిపోయే ముందు రోజు ఉదయం ఆ పక్కన బాలాజీ దర్శన్ హోటల్ లో కలిసి టిఫిన్ కూడా చేశారట.
అక్కడ జరిగిన చర్చ ఫలితమే ఈమె ఆత్మహత్య చేసుకోవడానికి కారణమని పోలీసులు బలంగా నమ్మరు. ఈమె శివరాం తో చేసిన చాటింగ్ లో అతను వేరే అమ్మాయిని పెళ్లి చేసుకుంటున్నాడని, తనను మోసం చేశాడనై గ్రహించిన ప్రవల్లిక ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు పోలీసులు తెలుసుకున్నారు. ప్రస్తుతం ఈ మొబైల్ చాట్ ను మరియు లెటర్ ను ఫోరెన్సిక్ లాబ్ కు పంపించాము.. అబ్బాయిపై కేసు నమోదు చేస్తామంటూ పోలీసులు తెలపడం జరిగింది.