పాకిస్తాన్ నిర్దేశించిన 192 పరుగుల లక్ష్యాన్ని ఇండియా త్వరగా కనుక చేధిస్తే న్యూజిలాండ్ కన్నా మెరుగైన రాం రేట్ ను సాధించి పాయింట్ల పట్టికలో మొదటి స్థానంలోకి వెళ్లే అవకాశం ఉంది. అందుకే మొదటి బంతి నుండి పాకిస్తాన్ బౌలర్లపై ఇండియా ఓపెనర్లు దాడిని మొదలు పెట్టారు. అందులో భాగంగానే షహీన్ ఆఫ్రిది వేసిన మొదటి బంతిని రోహిత్ శర్మ ఫోర్ గా మలిచాడు. ఆ తర్వాత మరో ఓపెనర్ శుబ్మాన్ గిల్ జరంగా కారణంగా గత రెండు మ్యాచ్ లు ఆడకపోవడంతో అందరి కళ్ళు ఇతనిపైనే ఉన్నాయి. కానీ శుబ్మాన్ గిల్ మాత్రం నిలకడగా ఆడి కొన్ని పరుగులు అయినా చేయకుండా ఆవేశంతో ఆడి 11 బంతులు మాత్రమే పేస్ చేసి 4 ఫోర్లతో 16 పరుగులు చేసి షహీన్ ఆఫ్రిది బౌలింగ్ లో షాదాబ్ ఖాన్ కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు.
కానీ గిల్ కొంచెం నిదానంగా ఆడి కనీసం అర్ద సెంచరీ చేసుకుని ఉంటే బాగుండేదని అభిమానుల అభిప్రాయం మరియు కోరిక.