తెలంగాణలో పోలీసు జాబ్స్..మరో ప్రకటన చేసిన రిక్రూట్మెంట్ బోర్డ్..

-

తెలంగాణ పోలీస్ ఉద్యోగాలకు సంభందించిన నోటిఫికేషన్ ను ఇటీవల విడుదల చేసిన సంగతి తెలిసిందే..దరఖాస్తుల ప్రక్రియ కూడా ముగిసింది. పోలీస్‌, జైళ్ల శాఖ, ఫైర్‌, ఎక్సైజ్‌, రవాణా శాఖల్లో కలిపి మొత్తం 17,291 ఖాళీలకు తెలంగాణ స్టేట్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్ దరఖాస్తులను ఆహ్వానించింది. కాగా, మొత్తం మూడు దశల్లో ఈ ఎంపిక ప్రక్రియ జరగనుంది. ఇందులో మొదటగా ప్రిలిమినరీ ఎగ్జామ్ ఉంటుంది. తర్వాత ఫిజికల్ టెస్ట్ లు ఉంటాయి. అనంతరం తుది రాత పరీక్ష ఉంటుంది. అయితే ఆగస్టు 7వ తేదీన ఎస్ఐ జాబ్స్ కు సంబంధించిన ప్రిలిమినరీ ఎగ్జామ్, రెండు వారాల తేడాతో ఆగస్టు 21న కానిస్టేబుల్ అభ్యర్థులకు ప్రిలిమినరీ ఎగ్జామ్ నిర్వహించేందుకు బోర్డు ఏర్పాట్లు చేస్తోంది. ఈ రెండు పరీక్షలు ఆదివారాలు కావడం విశేషం..

ఇది ఇలా ఉండగా.. ఈ పోస్ట్‌లకు రెండు దరఖాస్తులు రావడంతో రెండు యూజర్ ఐడీలు ఉన్న వారిని అధికారులు గుర్తించారు. ఇలా దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు దాదాపు మూడు లక్షలకు పైగా ఉన్నారని తెలిపారు.రెండు అవకాశాలు పొందొచ్చనే ఉద్దేశ్యంతో అభ్యర్థులు వేర్వేరు మొబైల్ నంబర్ ఇచ్చి దరఖాస్తు చేసుకున్నారు. కానీ అధికారులు పదో తరగతి హాల్ టికెట్ ఆధారంగా.. వేర్వేరు మొబైల్‌ నంబర్లతో చేసుకొన్న అప్లికేషన్లను మెర్జ్‌ చేశారు. అభ్యర్థి మొదట ఏ మొబైల్‌ నంబర్‌తో దరఖాస్తు చేసుకున్నారో అదే యూజర్‌ ఐడీగా ఉంటుందని తెలిపారు..ఈ విషయం గురించి సమాచారం ఇచ్చినట్లు తెలిపారు.

అన్ని రకాల పోస్టులకు ఒకేసారి ఫిజికల్‌ టెస్టులు నిర్వహిస్తామని నియామక మండలి నోటిఫికేషన్‌లోనే స్పష్టంగా తెలిపినట్లు అధికారులు గుర్తు చేశారు. దరఖాస్తుల మెర్జింగ్‌పై ఏమైనా అభ్యంతరాలుంటే అభ్యర్థులు 93937 11110, 93910 05006 నంబర్లను సంప్రదించాలని  పోలీస్ బోర్డు వెల్లడించింది.అయితే పోలీసు ఉద్యోగం కోసం అప్లై చేసుకున్న అభ్యర్థులు తీవ్రంగా నష్టపోతున్నారని అంటున్నారు.

ఫిజికల్ టెస్టు క్వాలిఫై అయిన వారికి ఎస్సై, కానిస్టుబుల్ కు అర్హతగా గుర్తించి.. ఈవెంట్స్ లో ఫెయిల్ అయిన వారికి కానిస్టుబుల్ కు మరో ఫిజికల్ ఈవెంట్స్ నిర్వహించాలని విజ్ఞప్తి చేస్తున్నారు..ఈ విషయం పోలీసు శాఖ ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి..

Read more RELATED
Recommended to you

Latest news