హైదరాబాద్ శివార్లలో రేవ్ పార్టీ.. మద్యం మత్తులో అమ్మాయిలతో చిందులు

-

హైదరాబాదులో రేవ్ పార్టీలు కొత్తేమి కాదు.  ఎప్పుడూ ఏదో ఒక పార్టీ అంటూ వ్యాపారవేత్తల, రాజకీయ నాయకులు కూడా ఇందులో పాల్గొంటారు. అయితే తాజాగా హైదరాబాద్ శివారులో మరోసారి బర్త్ డే సెలెబ్రేషన్స్ పేరుతో రేవ్ పార్టీ కలకలం రేపింది. శివారులో ఉన్న కడ్తల్ అనే ఓ రిసార్ట్ లో అర్ధరాత్రి మద్యం తాగి యువత చిందులు వేసింది. లాక్ డౌన్ రూల్స్ కు వ్యతిరేకంగా బర్త్ డే సెలెబ్రేషన్స్ జరిపారు. అయితే సమాచారం అందడంతో రంగంలోకి దిగారు పోలీసులు. తెల్లవారుజామున బర్త్ డే సెలెబ్రేషన్స్ ను పోలీసులు అడ్డుకున్నారు.

ఈ సెలెబ్రేషన్స్ లో 50 మంది యువతి, యువకులు ఉన్నారని పోలీసులు పేర్కొన్నారు. అంతేకాదు ముగ్గురు నిర్వాహకులు అరెస్ట్ కాగా, భారీగా లిక్కర్ బొటల్స్, డిజే సీజ్ చేశారు పోలీసులు. అయితే ఈ రేవ్ పార్టీలో పెద్ద పెద్ద వాళ్లకు సంబంధించిన వ్యక్తులు ఉన్నారని సమాచారం అందుతోంది ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇలాంటి ఘటనలు మళ్లీ పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని పోలీసులు పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news