నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. మజగాన్‌ డాక్‌ షిప్‌బిల్డర్స్ లో 1388 పోస్టులు..!

నిరుద్యోగులకు గుడ్ న్యూస్. మజగాన్‌ డాక్‌ షిప్‌బిల్డర్స్ లిమిటెడ్‌ (MDL) నిరుద్యోగులకు మంచి అవకాశాన్ని ఇస్తోంది. దీనిలో మొత్తం 1388 పోస్టులను భర్తీ చేయనున్నట్లు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తోంది. ఇక దీనికి సంబంధించి పూర్తి వివరాల లోకి వెళితే..

ఏసీ మెకానిక్‌, కంప్రెషర్‌ అటెండెంట్‌, చిప్పర్‌ గ్రైండర్‌, కాంపోసిట్‌ వెల్డర్‌ ,జూనియర్‌ డ్రాట్స్‌మ్యాన్‌, ఫిట్టర్‌ మొదలైన పోస్టులు ఉన్నాయి. అర్హత, ఆసక్తి వున్నవాళ్లు అప్లై చేసుకోవచ్చు. ఈ ఉద్యోగాలకు అప్లై చేసేందుకు జూలై 4ను ఆఖరి తేదీగా నిర్ణయించారు.

అభ్యర్థుల వయస్సు 18 – 30 ఏళ్లు ఉండాలి. రాతీపరీక్ష, అనుభం, ట్రేడ్‌ టెస్ట్‌ ఆధారంగా అభ్యర్థుల ఎంపిక నిర్వహించనున్నారు. అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ https://mazagondock.in ద్వారా అప్లై చేయాల్సి ఉంటుంది.

ఇక పోస్టుల వివరాల లోకి వెళితే..మొత్తం 1388 ఖాళీలు ఉండగా.. ఏసీ, రిఫ్రిజిరేటర్‌ మెకానిక్‌-5,
కంప్రెషర్‌ అటెండెంట్‌-5, కార్పెంటర్‌-81, చిప్పర్‌ గ్రైండర్ – 13, కాంపోసిట్‌ వెల్డర్ – 132,
డీజిల్ క్రేన్‌ ఆపరేటర్‌ – 5, డీజిల్ కమ్‌ మోటార్‌ మెకానిక్‌ – 4, జూనియర్‌ డ్రాట్స్‌మ్యాన్-54‌,
ఎలక్ట్రిషియన్‌ – 204, ఎలక్ట్రానిక్‌ మెకానిక్‌ – 55, ఫిట్టర్‌-119.

అదే విధంగా జూనియర్‌ క్యూసీ ఇన్‌స్పెక్టర్‌-13, గ్యాస్‌ కట్టర్‌-38, మెషినిస్ట్‌-28, మిల్‌వ్రైట్‌ మెకానిక్‌-10, పెయింటర్‌-100, పైప్‌ ఫిట్టర్‌-140, రిగ్గర్‌-88. అలానే స్ట్రక్చురల్‌ ఫ్యాబ్రికేటర్‌-125, స్టోర్‌ కీపర్‌-10, యుటిలిటీ హ్యాండ్‌-14, ప్లానర్‌ ఎస్టిమేటర్‌-8, పారామెడిక్స్‌-2 మరియు యుటిలిటీ హ్యాండ్‌-135 పోస్టులు వున్నాయి.