రైతులకు గుడ్ న్యూస్ చెప్పింది తెలంగాణ సర్కార్. ఈ నెల 15 నుండి రైతుబంధు పథకం నిధులు విడుదల కానున్నాయి. – ఈ నెల 15 నుండి 25 వరకు రైతుబంధు నిధులు రైతుల ఖాతాలలో జమచేయబడతాయని వ్యవసాయ శాఖ వెల్లడించింది. ఇక ఇప్పటికే రైతుబంధుకు 63.25 లక్షల మంది అర్హులు అని తుది జాబితాను వ్యవసాయ శాఖకు అందజేసింది సీసీఎల్ఎ. 63 లక్షల 25 వేల 695 మంది అర్హులైన రైతులకు చెందిన 150.18 లక్షల ఎకరాలకు రూ.7508.78 కోట్లు అవసరమవుతాయని..గత యాసంగి కన్నా 2.81 లక్షల మంది రైతులు పెరిగగా, నూతనంగా 66 వేల 311 ఎకరాలు చేరాయని వ్యవసాయ శాఖ తెలిపింది.
మొదటిసారి అర్హులైన రైతులు స్థానిక ఏఈఓలు, ఏఓలను కలిసి పట్టాదార్ పాసుబుక్కు, ఆధార్ కార్డు, బ్యాంకు ఖాతా వివరాలతో కూడిన నకలు అందించాలని వ్యవసాయ శాఖ పేర్కొంది. బ్యాంకుల విలీనంతో ఐఎఫ్ఎస్ సీకోడ్ లు మారిన ఖాతాదారులు ఆందోళన చెందవద్దని.. ఏమైన అనుమానాలుంటే స్థానిక వ్యవసాయాధికారులు నివృత్తి చేస్తారని పేర్కొంది. అత్యధికంగా నల్లగొండ జిల్లాలో 4,72,983 మంది రైతులు అర్హులు కాగా.. అత్యల్పంగా మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లాలో 39,762 మంది రైతులు అర్హులుగా ఉన్నారు.