యంగ్ హీరో నాగశౌర్య ఫామ్ హౌజ్ పేకాట కేసులో విచారణ కొనసాగుతోంది. పేకాట నిర్వహిస్తున్న గుత్తా సుమన్ కుమార్ తో పాటు మరి కొందరిని పోలీసులు విచారిస్తున్నారు. సుమన్ కు నాగ శౌర్య మద్య సంబంధాలపై విచారణ కొనసాగుతోంది. అంతే కాకుండా ఈ కేసులో నాగశౌర్య బాబాయ్ బుజ్జి పేరు తెరపైకి వచ్చింది. నాగ శౌర్య బాబాయ్ బుజ్జి పై అనుమానాలు వస్తున్నాయి. దాంతో లోతుగా అధికారులు విచారణ జరుపుతున్నారు. గుత్తా సుమన్ కుమార్ ఫోన్ ను పోలీసులు సీజ్ చేసారు. నగరానికి చెందిన 20 మంది ప్రముఖుల్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇక నార్సింగి ఇన్స్పెక్టర్ శివకుమార్ మాట్లాడుతూ..
సాయంత్రం విల్లా పై పోలీసులు రైడ్ చేసి ముప్పై మందిని అదుపులోకి తీసుకున్నట్టు పేర్కొన్నారు. ఫార్మ్ హౌస్ కేసులో నాగ శౌర్య తండ్రి రవీంద్ర ప్రసాద్ కు నోటీసులు ఇచ్చి విచారణకు హాజరు కావాలని చెప్పినట్టు తెలిపారు. రెంటల్ అగ్రిమెంట్ తో పోలీసుల నాగశౌర్య తండ్రి హాజరు కాబోతున్నారు.
రవీంద్ర ప్రసాద్ వద్ద సుమన్ విల్లాను ఒకరోజుకి అద్దెకు తీసుకున్నారు. బర్త్ డే పార్టీ పేరుతో సుమన్ విల్లా ను అద్దెకు తీసుకున్నారు. అయితే రవీంద్ర ప్రసాద్ కు తెలిసే జూదం జరిగిందా అని పోలీసులు అనుమానిస్తున్నారు.