ఎబ్బే: కోడి గుడ్లు దొంగతనం చేసి దొరికిపోయిన పోలీస్…!

-

చండీగర్ ‌లోని ఒక ఆశ్చర్యకర సంఘటన చోటు చేసుకుంది. ఒక బండి నుంచి కోడి గుడ్లు దొంగిలించి ఒక పోలీస్ అడ్డంగా దొరికిపోయాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పంజాబ్ హెడ్ కానిస్టేబుల్‌ను సస్పెండ్ చేశారు. హెడ్ కానిస్టేబుల్‌ను ప్రిత్‌పాల్ సింగ్‌గా గుర్తించారు. పంజాబ్‌లోని ఫతేగర్ సాహిబ్ పోలీస్ స్టేషన్‌ లో ఆయన పని చేస్తున్నారు. దీనికి సంబంధించి పంజాబ్ పోలీసులు ట్వీట్ చేశారు.

“ఒక వీడియో వైరల్ అయ్యింది, ఇందులో ఫతేగర్ సాహిహిప్ నుండి హెచ్ సి ప్రిత్పాల్ సింగ్ ఒక బండి వద్ద గుడ్లు దొంగిలించినందుకు కెమెరాలో దొరికాడు. యజమాని దూరంగా ఉన్నప్పుడు అతని యూనిఫాం ప్యాంటులో కోడి గుడ్లు దాచాడు” అని పేర్కొన్నారు. బండి యజమాని తిరిగి వచ్చిన తర్వాత ఏమీ జరగలేదని నటిస్తూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు.

Read more RELATED
Recommended to you

Latest news