స్వచ్ఛభారత్ మిషన్ భారత ప్రభుత్వం చేపట్టిన ఒక ప్రధాన కార్యక్రమం. దీనిని 2014 అక్టోబర్ 2న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రారంభించారు. ఈ మిషన్ లక్ష్యం లో భాగంగా దేశంలో బహిరంగ మలవిసర్జన (open defecation)నిర్మూలన, స్వచ్ఛత పారిశుధ్యం, పెంపొందించడం ఘన ద్రవ వ్యర్ధాల నిర్వహణకు మెరుగుపరచడం. ఈ కార్యక్రమం గ్రామీణ పట్టణ విభాగాలుగా విభజించారు. ఈ స్వచ్ భారత్ మిషన్ లో కేంద్ర ప్రభుత్వం లక్షల మరుగుదొడ్లను నిర్మించారు. ఇప్పుడు ఆ వివరాలు చూద్దాం..
స్వచ్ఛభారత్ మిషన్: ఈ మిషన్ ద్వారా దేశవ్యాప్తంగా లక్షల మరుగుదొడ్లు నిర్మించబడ్డాయి. ఇది ఒక చారిత్రాత్మక విజయం గా పరిగణించబడుతుంది. 2019 నాటికి స్వచ్ఛభారత్ మిషన్ ద్వారా 12 కోట్లకు పైగా వ్యక్తిగత గృహ మరుగుదొడ్లు నిర్మించబడ్డాయి. ఇందులో 11.5 కోట్లు గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నాయి. పట్టణ ప్రాంతాల్లో6.36 లక్షల కమ్యూనిటీ పబ్లిక్ టాయిలెట్లు నిర్మించారు దీనివల్ల పట్టణ ప్రాంతాల్లో పారిశుద్ధ సౌకర్యాలు ఘనంగా మెరుగుపడ్డాయి. 2019 అక్టోబర్ రెండు నాటికి దేశం బహిరంగ మాల విసర్జన రహిత ప్రాంతాలను సాధించినట్లు ప్రకటించారు. ఇది మహాత్మా గాంధీ 150వ జయంతి సందర్భంగా ప్రకటించడం జరిగింది.

ఆరోగ్య పరిరక్షణ: స్వచ్ఛభారత్ మిషన్ వల్ల 2014తో పోలిస్తే 2019లో మూడు లక్షల మరణాలు తగ్గాయని WHO నివేదికలో తెలిపారు. అంతేకాక శిశు బాలల మరణాల రేటు గణనీయంగా తగ్గింది. మరుగుదొడ్ల నిర్మాణం వల్ల 93% మంది మహిళలు ఇంట్లోనే టాయిలెట్ సౌకర్యం ఉండడం వల్ల సురక్షితంగా భావిస్తున్నారు.
కేంద్రం ముందడుగు: 2020-21 నుండి 2024- 25 వరకు అమల్లో ఉన్న రెండవ దశ ODF హోదాను నిలబెట్టడం ఘన మరియు ద్రవ వ్యర్ధాల నిర్వహణ మెరుగుపరచడం లక్ష్యంగా భావిస్తున్నారు. 2023 24 లో గ్రామీణ రంగానికి 7 కోట్లు మరియు పట్టణ రంగానికి ఐదు కోట్లు కేటాయించబడ్డాయి. పట్టణ ప్రాంతాల్లో ఆటోమేటిక్, పబ్లిక్ టాయిలెట్లు ,ఉమెన్ టాయిలెట్స్, వాష్ రూమ్ తో కూడిన కేఫ్ లు వంటివి అధునాతన సౌకర్యాలతో నిర్మించబడుతున్నాయి. తెలంగాణలో స్వచ్ఛభారత్ కింద 31 లక్షల మరుగుదొడ్లు నిర్మించబడ్డాయి. ఈ స్వచ్ భారత్ మిషన్ ద్వారా లక్షల మరుగుదొడ్ల నిర్మాణం మహత్తర విజయం అయినప్పటికీ దీన్ని స్థిరత్వం సరైన వాడకం కోసం ప్రజల్లో అవగాహన పెంచడం నీటి సరఫరా మెరుగుపరచడం వంటి అంశాలను బలోపేతం చేయడం అవసరం.