ఉత్తరాఖండ్ లో వీధి కుక్కలకు పోలీస్ ట్రైనింగ్, వీడియో వైరల్…!

-

ఉత్తరాఖండ్ లో వీధి కుక్కలకు ట్రైనింగ్ ఇవ్వడం ఇప్పుడు ఆశ్చర్యంగా మారింది. సాధారణంగా పోలీసు బలగాల్లో పని చేసే కుక్కలు ప్రత్యేకమైన జాతులకు చెందినవి ఉంటాయి. చిన్నప్పటి నుంచే వాటిని ప్రత్యేకంగా పెంచడంతో పాటు ఆహరం విషయంలో అనేక జాగ్రత్తలు తీసుకుని ధృడంగా తయారు చేస్తారు. చిన్నప్పటి నుంచే వాటికి అనేక మెళుకువలు నేర్పిస్తూ పోలీసు అధికారులు శిక్షణ ఇస్తూ ఉంటారు. జ్ఞాపక శక్తితో పాటు… ఏదైనా సరే సులువుగా గుర్తించే విధంగా, ఎలాంటి పరిస్థితుల్లో అయినా సరే తట్టుకునే విధంగా,

వాటిని తయారు చేసి విధుల్లోకి తీసుకుంటారు అధికారులు. అయితే ఇక్కడ ఉత్తరాఖండ్ పోలీసులు వినూత్నంగా ఆలోచించారు. ఉత్తరాఖండ్ పోలీసులు వీధి కుక్కలను పోలీసు బలగాలలో చేర్చడానికి శిక్షణ ఇవ్వడం ప్రారంభించారు. స్నిఫర్ కుక్కలతో పాటు వీధి కుక్కల శిక్షణా సెషన్ నుండి ఉత్తరాఖండ్ పోలీసులు ట్విట్టర్ లో వీడియో పోస్ట్ చేశారు. ఇక ఈ శిక్షణ ఇస్తున్న సమయంలో వీధి కుక్కలు కూడా చాలా శ్రద్దగా నేర్చుకోవడం మనం గమనించవచ్చు . ఉత్సాహంతో, వీధి కుక్కలు స్నిఫర్ కుక్కల మాదిరిగానే ప్రదర్శించాయి.

police training for street dogs In UP

అడ్డంకులను అధిగమించి పోలీసు అధికారులతో పాటు కవాతు కూడా చేశాయి. దీనిపై ట్విట్టర్ లో షేర్ చేస్తూ అధికారులు… ఈ స్నిఫర్ డాగ్ టీంని # ఉత్తరాఖండ్ పోలీస్ ల గర్వంగా భావిస్తున్నాం. ఉత్తరాఖండ్ పోలీసులు ఈ డాగ్ స్క్వాడ్‌లో చేరడానికి వీధి కుక్కలకు శిక్షణ ఇచ్చారు. ఈ బృందం ప్రదర్శించిన కొన్ని అద్భుతమైన విన్యాసాలు చూడండి అంటూ ట్వీట్ చేశారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. పాపం ఆదుకునే వారు లేక వీధుల్లో బ్రతికే కుక్కలకు ఈ విధంగా శిక్షణ ఇచ్చి వాటికి ఒక జీవితాన్నీ ప్రదర్శించిన అధికారులపై ప్రసంశలు కురిపిస్తున్నారు నెటిజన్లు.

Read more RELATED
Recommended to you

Exit mobile version