మహా గవర్నర్ గా నిమ్మగడ్డ…?

-

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఇప్పుడు చేపట్టే బాధ్యతలు ఏమిటి అనేదానిపై ఆసక్తికర చర్చలు జరుగుతున్నాయి. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గా నిమ్మగడ్డ రమేష్ కుమార్ రాజీనామా చేసిన తర్వాత వేసే అడుగులు ఎట్లా ఉంటాయి ఏంటనే దానిపై అందరిలో కూడా ఆసక్తి నెలకొంది. అయితే నిమ్మగడ్డ రమేష్ కుమార్ గవర్నర్ గా బాధ్యతలు చేపట్టడం దాదాపుగా ఖరారైంది అనే వ్యాఖ్యలు కూడా రాజకీయ వర్గాల్లో వినపడుతున్నాయి.

ప్రస్తుతం నిమ్మగడ్డ రమేష్ కుమార్ విదేశాలకు వెళ్లి స్థిరపడి ఆలోచనలో ఉన్నారు అనే ప్రచారం కూడా జరుగుతోంది. ఇది ఎంతవరకు నిజం ఏంటనేది తెలియదు గానీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ మాత్రం ఎప్పుడో కొన్ని కొన్ని అంశాల్లో ఆసక్తిని రేకెత్తిస్తున్నారు. ఆయనకు కేంద్ర ప్రభుత్వంలో ఒక పదవి దక్కే అవకాశం ఉందని సమాచారం. ఖచ్చితంగా మధ్యప్రదేశ్ గవర్నర్ గా ఆయన బాధ్యతలు చేపడతారని కొంతమంది అంటున్నారు.

కానీ ఇప్పుడు మహారాష్ట్ర గవర్నర్ గా నిమ్మగడ్డ రమేష్ కుమార్ బాధ్యతలు చేపట్టనున్నారని తెలుస్తోంది. మహారాష్ట్ర ప్రభుత్వాన్ని కూల్చాలనే ఆలోచనలో ఉన్న భారతీయ జనతా పార్టీకి… నిమ్మగడ్డ రమేష్ కుమార్ రాజ్యాంగం తెలిసిన వ్యక్తి కావడం గవర్నర్ వ్యవహారాలను దగ్గరగా చూడటం వంటివి బాగా నచ్చాయి. అందుకే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం గవర్నర్ గా నియమించే అవకాశాలు ఉండవచ్చని తెలుస్తోంది. రమేష్ కుమార్ రెండేళ్లపాటు గవర్నర్గా మహారాష్ట్రలో బాధ్యతలు చేపట్టే అవకాశాలు కనబడుతున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news