గతంలో అలా… ఇప్పుడు ఇలా.. మర్చిపోతే ఎలా…!

-

హామీ ఇచ్చిన నేత మర్చిపోయారు… జనం మర్చిపోయారు… అయినా సరే గూగుల్ మర్చిపోదుగా… ఇట్టా కొడితే అట్టా వస్తుంది… ఇది సరిలేరు నీకెవ్వరు సినిమాలో మహేశ్ బాబు డైలాగ్. ఇప్పుడు ఇదే డైలాగ్‌ రాజకీయ పార్టీలు విపరీతంగా వాడేస్తున్నారు. నిజమే.. రాజకీయ నేతల మాటలు, హామీలు నీటి మీద మూటలంటారు. అందుకే ప్రతిసారి ఎన్నికల్లో నేతలంతా హామీలివ్వడం… అవి నేరవేర్చలేకపోవడం సర్వ సాధారణం. మళ్లీ ఎన్నికల సమయంలో ప్రతిపక్షాలు గతంలో ఇచ్చిన హామీలను తవ్వి తీయడం… కామన్ కూడా. అయితే ఈసారి మాత్రం పరిస్థితి వేరుగా ఉంది.

ఇందుకు ప్రధాన కారణం గూగుల్, యూట్యూబ్. నిజమే సోషల్ మీడియా ఇప్పుడు నేతలకు చుక్కలు చూపిస్తోంది. ఏం మాట్లాడాలన్నా కూడా ఆచితూచి వ్యవహరించాలని వార్నింగ్ ఇస్తోంది. ఇంకా చెప్పాలంటే గతంలో చెప్పిన మాటలు.. ఇప్పుడు చెబుతున్న మాటలను బేరీజ్ వేస్తూ… నేత నిజస్వరూపాన్ని బయట పెడుతోంది సోషల్ మీడియా.

ప్రస్తుతం వైసీపీకి ఎదురుగాలి వీస్తోందనే చెప్పాలి. అన్ని విషయాల్లో ప్రతిపక్షాలను కట్టడి చేస్తున్న అధికార పార్టీ నేతలు… ఒక్క వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో మాత్రం ఏం చేయాలో… ఏం చెప్పాలో అర్థం కాక తికమక పడుతున్నారు. వాస్తవానికి 2019 మార్చి నెలలో వివేకానంద రెడ్డి హత్య జరిగిన రోజున వైసీపీ నేతలు చెప్పిన మాటలు… ఇప్పుడు చేస్తున్న వ్యాఖ్యలు.. సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. అప్పట్లో వైసీపీ అధినేత వైఎస్ జగన్ సహా ఇతర ముఖ్య నేతలంతా కూడా వివేకాను హత్య చేసింది టీడీపీ నేతలే అని… చేయించింది చంద్రబాబు అంటూ ఆరోపణలు చేశారు.

చివరికి సాక్షి మీడియాలో సైతం నారాసుర రక్త చరిత్ర అంటూ వార్తలు రాశారు. అయితే ఇప్పుడు మాత్రం వైసీపీ నేతలు చెబుతున్న మాటలు పూర్తి విరుద్ధంగా ఉన్నాయి. తాజాగా వైఎస్ జగన్ మేనమామ, కమలాపురం ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. గంగిరెడ్డి చేస్తుంటే… నిలబడి అమాయకంగా చూస్తున్నాడు తప్ప… ఇంకోటి ఏం లేదన్నారు. అయితే ఇదే రవీంద్ర గతంలో చంద్రబాబు హత్య చేయించినట్లు ఆరోపించారు. ఆ వీడియోను ఇప్పుడు టీడీపీ నేతలు బయటకు తీశారు. నాటి, నేటి వీడియోలను కలిపి సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version