జనసేనలోకి మోత్కుపల్లి.. ఇచ్చేది ఆ పదవేనా?

-


టీడీపీ పార్టీ నుండి బహిష్కరించబడిన మోత్కుపల్లి నరసింహులు జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్‌ కళ్యాణ్ తో భేటీ కానున్నారు. మొదటి నుండి టీడీపీలో కీలక నేతగా ఉన్న మొత్కుపల్లి చంద్రబాబును విమర్శించడంతో ఆ పార్టీ నుండి వెలివేయబడ్డారు. కాగా ఇప్పుడు జనసేన అధినేతతో భేటీ రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చ జరుగుతోంది.
జనసేనలో చేరేందుకు పవన్ కల్యాణ్‌తో భేటీ కాబోతున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. మోత్కుపల్లి జనసేనలో చేరితే ఆయనకు అధ్యక్షపదవి ఇచ్చే అవకాశాలున్నాయంటూ విశ్లేషణలు వస్తున్నాయి. తెలంగాణలో జనసేనకు కీలక నేతలు ఎవరూ లేరు కాబట్టి మోత్కుపల్లిని జనసేన తెలంగాణ అధ్యక్షుడిగా నియమించే అవకాశం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు.

మోత్కుపల్లి అసలు పవన్ కల్యాణ్‌ను ఎందుకు కలవబోతున్నారు?.. ఆయన నిజంగానే జనసేనలో చేరుతారా?.. ఆయన ఎలాంటి పదవి కోరుకుంటున్నారు?.. ఇలాంటి ప్రశ్నలన్నింటికీ సమాధానాలు తెలియాలంటే సాయంత్రం వరకూ వేచిచూడాలి. ఈ రోజు (గురువారం) మధ్యాహ్నం 3 గంటలకు వీరి భేటీ జరగనుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version