ఐదు రాష్ట్రాల ఓట్ల లెక్కింపు జరుగుతోంది. ఐదు రాష్ట్రాల్లో ఉత్తర్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో బీజేపీ క్లియర్ కట్ గా మెజారిటీ సాధించింది. మణిపూర్, గోవాల్లో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించింది. ఇక పంజాబ్ లో ఆప్ స్వీప్ చేసింది. దీంతో బీజేపీ, ఆప్ శ్రేణుల్లో ఆనందం వెళ్లివిరుస్తోంది. దేశ వ్యాప్తంగా బీజేపీ కార్యకర్తలు, నాయకులు విజయోత్సవాలకు సిద్ధం అవుతున్నారు.
ఇదిలా ఉంటే ఐదు రాష్ట్రాల్లో గెలిచిన పార్టీలకు ఎన్నికల సంఘం గుడ్ న్యూస్ చెప్పింది. కోవిడ్ పరిస్థితిని సమీక్షిస్తూ… కౌంటింగ్ తరువా విజయోత్సవ ఊరేగింపులపై మార్గదర్శకాలను సడలించాలని నిర్ణయించింది. ఎన్నికల్లో విజయోత్సవాలపై నిషేధాన్ని ఎత్తేసింది. కాగా ఈ సడలింపులు స్టేట్ డిజాస్టర్ మేనేజింగ్ అథారిటీ నివారణ చర్యలకు లోబడి.. జిల్లా అధికారులు విధించిన చర్యలకు లోబడి ఉంటాయని భారత ఎన్నికల సంఘం ప్రకటించింది. ప్రస్తుతం ఎన్నికల సంఘం తీసుకున్న ఈ నిర్ణయం.. గెలిచిన పార్టీలకు ముఖ్యంగా బీజేపీ పార్టీ కార్యకర్తలకు, శ్రేణులకు మరింత జోష్ నింపనుంది.