సార్వత్రిక ఎన్నికలకు సెమీ ఫైనల్ గా భావిస్తున్న 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు విడుదల అవుతున్నాయి. అత్యంత కీలకంగా భావిస్తున్న ఉత్తర్ ప్రదేశ్ లో బీజేపీ ముందంజలో ఉంది. పోస్టల్ బ్యాలెట్ లో సత్తా చాటింది. యూపీ మొత్తం 403 స్థానాలు ఉంటే… 150 స్థానాలకు పైగా నియోజకవర్గాల్లో బీజేపీ లీడ్ లో ఉంది.
ఇదిలా ఉంటే కొన్ని ఆసక్తి ఫలితాలు కూడా కనిపిస్తున్నాయి. రైతు ఉద్యమం, మూడు వ్యవసాయ చట్టాలు రద్దు చేయాలని ఉద్యమం చేస్తున్న సమయంలో చాలా ప్రముఖంగా వినిపించిన పేరు లఖీంపూర్ ఖేరీ. యూపీలో రైతు ఉద్యమం సమయంలో లఖీంపూర్ ఖేరీలో హింస చెలరేగింది. కేంద్ర మంత్రి అజయ్ మిశ్రా కొడుకు కారుతో రైతులను తొక్కించాడనే ఆరోపణలు ఉన్నాయి. ఈ కేసులు కేంద్రమంత్రి కొడుకు ఇటీవల జైలు నుంచి బెయిల్ పై విడుదలయ్యారు. ఈ ఘటనలో పలువురు రైతులు మరణించారు.
ఇదిలా ఉంటే ప్రస్తుతం లఖీంపూర్ ఖేరీలో అనూహ్య ఫలితాలు వస్తున్నాయి. రైతు ఉద్యమానికి కేరాఫ్ గా ఉన్న పలు వివాదాలకు కారణం అయిన యూపీ లఖీంపూర్ ఖేరిలో బీజేపీ ముందంజలో ఉంది. బీజేపీపై పెద్దగా వ్యతిరేఖత కనిపించకపోవడం అనూహ్యంగా చెప్పవచ్చు.