చాలా మంది సొంతింటి కలను నెరవేర్చుకోవాలని అనుకుంటారు. అయితే సొంతింటి కల సాకారం చేసుకోవడానికి ప్రధాన మంత్రి ఆవాస్ యోజన బాగా హెల్ప్ అవుతోంది. అల్ప ఆదాయ కుటుంబాలు, మధ్య ఆదాయ వర్గాలు, ఆర్థికంగా వెనుకబడిన వర్గాల వారికి రెండు కోట్ల గృహాలను నిర్మించడమే కేంద్రం లక్ష్యం.
అయితే ఈ స్కీమ్ కింద మహిళలకు కూడా ప్రయోజనం కలగనుంది. ప్రాథమికంగా గిరిజనులు, ఆదివాసీలు వంటి వాళ్ళ కోసం ప్రధాన మంత్రి ఆవాస్ యోజనను తీసుకొచ్చారు. PMAY మార్గదర్శకాల ప్రకారం వీరికి ఇళ్ళని ఇస్తారు. ఈ స్కీమ్ లో హోమ్ లోన్ ని పొందొచ్చు. భారత ప్రభుత్వం వడ్డీ రాయితీని ఇస్తోంది. హోమ్ లోన్‌పై సబ్సిడీ వడ్డీ రేటు సంవత్సరానికి 6.50% గా ఉంటుంది.
లబ్ధిదారులందరికీ 20 సంవత్సరాల లోన్ గడువుకు ఈ వడ్డీ సబ్సిడీ ఆఫర్ వర్తిస్తుంది. సబ్సిడీ కింద రూ. 2.5 లక్షల వరకు కూడా సేవ్ చేసుకోచ్చు. అయితే దీనిని కేటాయించే సమయంలో సీనియర్ సిటిజన్‌లు, వికలాంగులకు ప్రాధాన్యం ఇస్తారు.
ఈ స్కీమ్ మహిళల పేరుతో ఇంటి నిర్మాణం కోసం ప్రోత్సాహిస్తుంది. సుస్థిరమైన, పర్యావరణ అనుకూల టెక్నాలజీని ఈ స్కీమ్ లో ఉపయోగిస్తారు. PM ఆవాస్ యోజనకు చెందిన క్రెడిట్ లింక్డ్ సబ్సిడీని భారతదేశంలోని అన్ని చట్టబద్ధమైన పట్టణాలలో కూడా అమలు చేస్తున్నారు. ఈ స్కీమ్ గరిష్టంగా రూ.6 లక్షల హోమ్ లోన్ మొత్తంపై వడ్డీరేటు ఆఫర్ వర్తిస్తుంది.
20 ఏళ్ల పాటు 6.5 శాతం వడ్డీ రేటు సబ్సిడీ ఉంటుంది. మధ్య ఆదాయ వర్గాలలోని MIG-1 విభాగం కిందకు వచ్చే వారికి రూ.9 లక్షల హోమ్ లోన్ మొత్తంపై, 20 ఏళ్ల వరకు నాలుగు శాతం వడ్డీ రేటు సబ్సిడీ ఉంటుంది. MIG-2 విభాగానికి చెందిన వారికి రూ.12 లక్షల లోన్ మొత్తంపై, 20 ఏళ్ల వరకు 3 శాతం వడ్డీ రేటు సబ్సిడీ వర్తిస్తుంది. PMAY పథకం కింద వర్తించే అన్ని గృహ రుణాలపై GSTని 12% నుంచి 8% వరకు తగ్గించాలని కేంద్రం నిర్ణయం తీసుకుంది.