రాజకీయ నాయకులు అంటే అసాధ్యాన్ని సుసాధ్యం చేసి చూపిస్తారు. మనం చూసే ఉంటాం.. ఎన్నికల క్యాంపైన్‌కు వెళ్లినప్పుడు ఏవేవో పనులు చేస్తుంటారు. సరే అవి అన్నీ ఒక ఎత్తు అయితే ఈరోజు జరిగింది నిజంగా చాలా గొప్ప సంఘటనే. డిప్యూటీ సీఎం స్థానంలో ఉండి ఒక అమ్మాయి కాలి బొటనవేలితే నుదిటిపై బొట్టు పెట్టుకున్నాడు. మహారాష్ట్ర డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్‌కి సంబంధించిన కొన్ని ఫోటోలు అందర్ని ఆకట్టుకుంటున్నాయి. ఓ అంగవైకల్యం కలిగిన యువతి చూపించిన ఆదరాభిమానానికి తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు ఫడ్నవీస్.
రాష్ట్రంలోని జలగావ్ పర్యటనలో భాగంగా అక్కడ వికలాంగుల అభ్యున్నతి, అవసరాల కోసం దీపస్తంభ్ ఫౌండేషన్ నిర్వహించిన ఓ కార్యక్రమానికి ఫడ్నవీస్ చీఫ్ గెస్ట్‌గా అటెండ్ అయ్యారు. కార్యక్రమానికి వచ్చిన ఉపముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌కు స్వాగతం పలికిన ఓ అంగవైకల్యం ఉన్న యువతి చూపించిన ఆదరాభిమానానికి డిప్యుటీ సీఎం భావోద్వేదానికి లోనయ్యారు.
వికలాంగురాలిగా ఉన్న యువతి నేలపై కూర్చొని ఉంటే డిప్యుటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ ఆమెతో పాటే నేలపై కూర్చున్నారు. అప్పుడు ఆ అంగవైకల్యం కలిగిన యువతి కాలి బొటన వేలితో ప్లేట్‌లోంచి తిలకం తీసి మహారాష్ట్ర డిప్యుటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ నుదుటిన పెట్టింది. అటుపై హారతి ఇచ్చింది.
ఓ అంగవైకల్యం కలిగిన యువతి తన కాలి బొటన వేలుతో నుదుటిన తిలకం పెడుతున్న సమయంలో దేవేంద్ర ఫడ్నవీస్ భావోద్వేగానికి గురయ్యారు. అక్కడున్న వాళ్లు ఆ దృశ్యాన్ని చూసి కళ్లు చెమ్మగిల్లాయి.
అటుపై ఆమెకు రెండు చేతులు జోడించి నమస్కరించిన ఫడ్నవీస్ ఆమె ముఖంలోని నవ్వు చూసి సంతోషపడ్డారు. తాను పొందిన అనుభూతిని వర్ణిస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు . ఇప్పటి వరకు తాను చాలా మంది తల్లులు, సోదరిమణుల నుంచి నేరుగా ఆశీర్వాదం తీసుకున్నాను. బొట్టు పెట్టించుకున్నాను. కాని ఒక సోదరి బొటనవేలు తన నుదిటిన చేరింది. అయితే అది చేతి వేలు కాదని కాలి బొటనవేలని పేర్కొన్నారు. చేతులు లేని ఓ సోదరి తనకు కాలి బొటన వేలుతో తిలకం దిద్ది, అదే వేళ్లతో హారతి ఇచ్చింది. అప్పుడు ఆమె మొహంలో చిరునవ్వు, కళ్లల్లో ఒకరకమైన మెరుపు కనిపించిందని ట్విట్టర్‌లో పెట్టారు ఫడ్నవీస్. ఆమె ముఖంలో కనిపించిన వెలుగు చూస్తే అలాంటి వాళ్ల పట్ల జాలీ, దయ చూపాల్సిన అవసరం లేదని ఎలాంటి పరిస్థితి ఎదురైనా దాటుకొని వెళ్తారని పోస్ట్ పెట్టారు.
ఒక ఉపముఖ్యమంత్రి స్థానంలో ఉన్న నాయకుడు అంగవైకల్యం ఉన్న యువతి చూపించిన ఆదరాభిమానం, ప్రేమకు ఒప్పొంగిపోయారు. ఆమెకు ఎల్లవేళలా అండగా ఉంటానని ఆమె చేసే ప్రతి పోరాటంలో బాసటగా నిలుస్తానని భరోసా ఇచ్చారు.