మంచిర్యాలలో కారుకు బ్రేకులు..హస్తం వశమే.!

-

ఉమ్మడి ఆదిలాబాద్ మంచిర్యాల నియోజకవర్గం..బి‌ఆర్‌ఎస్ పార్టీకి కంచుకోట. ఇక్కడ బి‌ఆర్‌ఎస్ హవా ఎక్కువ నడుస్తుంది. 2009 నుంచి ఇక్కడ బి‌ఆర్‌ఎస్ సత్తా చాటుతుంది. 2009లో టి‌డి‌పితో పొత్తులో భాగంగా బి‌ఆర్‌ఎస్ మంచిర్యాలలో పోటీ చేసి గెలిచింది. అప్పుడు బి‌ఆర్‌ఎస్ నుంచి గడ్డం అరవింద్ రెడ్డి గెలిచారు. తర్వాత టి‌డి‌పి నుంచి బయటకొచ్చి ఉపఎన్నికలకు వెళ్ళడంతో..2010 ఉపఎన్నికలో కూడా బి‌ఆర్‌ఎస్ గెలిచింది.

ఇక తెలంగాణ వచ్చాక 2014 ఎన్నికల్లో సైతం మంచిర్యాలలో బి‌ఆర్‌ఎస్ హవా నడిచింది. బి‌ఆర్‌ఎస్ నుంచి నడిపల్లి దివాకర్ రావు గెలిచారు. అప్పుడు దాదాపు 59 వేల ఓట్ల మెజారిటీతో బి‌ఆర్‌ఎస్ గెలిచింది. 2018 ఎన్నికలకు వచ్చేసరికి బి‌ఆర్‌ఎస్ కు కాస్త టఫ్ ఫైట్ ఎదురైంది. ఆ ఎన్నికల్లో దాదాపు 5 వేల ఓట్ల మెజారిటీతో గెలిచింది. కాంగ్రెస్ నుంచి కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు పోటీ చేసి ఓడిపోయారు. అయితే ఈ సారి మంచిర్యాలలో పోరు ఆసక్తికరంగా మారింది.

ఎమ్మెల్యే దివాకర్ రావుకు పరిస్తితులు పెద్దగా అనుకూలంగా లేవు. వరుసగా రెండుసార్లు గెలవడంతో సహజంగానే వ్యతిరేకత ఉంది. అటు కాంగ్రెస్ నుంచి ఓడిన ప్రేమ్ సాగర్ రావుపై సానుభూతి ఉంది. పైగా కాంగ్రెస్ లో బాగా కష్టపడుతున్నారు. ఈ లోపే లక్ష్యంగా ఆయన పనిచేస్తున్నారు. ఇక లేటెస్ట్ సర్వేల్లో కూడా ఈ సారి మంచిర్యాలలో కాంగ్రెస్ గెలుపు ఖాయమని తెలుస్తుంది.

అయితే చివరి నిమిషంలో పార్టీ గాలి…అధికార బలం లాంటివి ప్రభావం చూపవచ్చు. ఒకవేళ కాంగ్రెస్ వేవ్ ఉంటే డౌట్ లేకుండా మంచిర్యాలలో కారుకు బ్రేకులు పడి కాంగ్రెస్ గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని తెలుస్తుంది. ఇక్కడ బి‌జే‌పి ప్రభావం తక్కువే. గత ఎన్నికల్లో 5 వేల ఓట్లే వచ్చాయి. ఒకవేళ ఇప్పుడు ఓట్లు ఎక్కువ చీలిస్తే ఏ పార్టీకి నష్టమో చూడాలి. ఏదేమైనా మంచిర్యాలలో ప్రస్తుతం కాంగ్రెస్ లీడ్ లో ఉంది.

Previous article
దేశంలో డ్రగ్స్ వాడకం వలన ఎక్కువగా ఉండడంతో ప్రభుత్వం ఇలాంటి వాటిని కట్టడి చేయడానికి ఎక్కడికక్కడ రైడ్ లు చేస్తూ భారీగా వివిధ రకాల డ్రగ్స్ ను స్వాధీనం చేసుకుంటోంది. కాగా తాజాగా ఏపీలో నంద్యాల జిల్లా ఆత్మకూరులో స్థానిక పోలీసులు భారీగా గంజాయిని పట్టుకున్నారు. కాసేపటి క్రితం ఆత్మకూరులో సాయిబాబా నగరులో పోలీసులు సోదాలు నిర్వహించగా దాదాపుగా 15 కేజీల గంజాయిని పట్టుకున్నారు. కాగా ఈ పట్టివేతలో ఒకరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ వ్యక్తిని విచారించిన అనంతరం దీని వెనుక ఎవరున్నారు అన్నది బయటకు రానుంది. ఇలాంటి పోలీసులు చేస్తున్న ఆపరేషన్ లను హై లైట్ చేస్తే ముందు ముందు ఇంకా ఎవరైనా ఇలాంటి అసాంఘిక కార్యకలాపాలు చేయాలంటే ముందుకు రావడానికి భయపడతారు. ఇక యువత సైతం ఈ మత్తు మందుల భారిన పడకుండా జాగ్రత్త ఉండాలని పోలీసులు సలహాలు ఇస్తున్నారు.
Next article

Read more RELATED
Recommended to you

Exit mobile version