అచ్చెన్నకున్నది ఒక్క నాలుకే… కాకపోతే నరం లేదు కదా!

-

తమ పార్టీ జాతీయాధ్యక్షుడు చంద్రబాబుది రెండు కళ్ల సిద్ధాంతం కావడంతో తనది రెండు నాలుకల సిద్ధాంతంగా మార్చుకోవాలని భావిస్తున్నారో ఏమో తెలియదు కానీ… ఏడు నెలల క్రితం స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో ఎంత గట్టిగా వాదించారో.. నేడు కూడా అదేస్థాయిలో తనదైన రీతిలో అడ్డంగా వాదించడం మొదలుపెట్టారు!

ఏపీలో స్థానిక ఎన్నికలను వాయిదా వేసిన పరిస్థితుల్లో 2020 మార్చి 15న మైకులముందుకు వచ్చిన అచ్చెన్నాయుడు… కరోనాను కేంద్ర ప్రభుత్వం జాతీయ విపత్తుగా ప్రకటించిన నేపథ్యంలో ఎన్నికలను వాయిదా వేయడం కాదు.. అవసరమైతే ఏడాది పాటు నిర్వహించకుండా ఉండాలి.. అవసరమైతే రద్దు చేయాలి అని స్వయంగా చెప్పారు!

“కళాశాలలకు సెలవులు ఇవ్వాలి.. పరీక్షల నిర్వహణ ఆపేయాలి.. ఒక్క విద్యార్థికి కూడా కరోనా వ్యాది సోకకుండా ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ సమయంలో స్థానిక సంస్థల ఎన్నికలు ముఖ్యమా.. ప్రజల ఆరోగ్యం ముఖ్యమా.. నిమ్మగడ్డ రమేష్ కుమార్ తీసుకున్న నిర్ణయం అభినందనీయం” అన్న రేంజ్ లో ప్రసగించారు కూడా!

మరి ఈ ఏడు నెలల్లో కరోనా తగ్గిపోయిందో లేక కరోనా అచ్చెన్నకు వచ్చేసింది కాబట్టి ఇంక రెండోసారి రాదని ఫిక్సయ్యారో.. అదీగాక నిమ్మగడ్డ నిర్ణయం, ఆత్మసంతృప్తి కంటే తనకు ప్రజల ఆరోగ్యం ముఖ్యం కాదని భావిస్తున్నారో తెలియదు కానీ.. ఎందుకు ఎన్నికలు పెట్టడం లేదు ప్రభుత్వం అంటూ ఫైరయిపోతున్నారు. కోవిడ్ కు సంబంధించిన అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ ఎన్నికలు జరపాలని.. జాగ్రత్తలు తీసుకుంటే కోవిడ్ దరికి చేరదని చెప్పుకొస్తున్నారు!! కన్ ఫాం… అచ్చెన్నకు ఉన్నది ఒక్క నాలుకే!

Read more RELATED
Recommended to you

Latest news