అసెంబ్లీలో టీఆర్ఎస్ లేడీ ఎమ్మెల్యే క‌న్నీళ్లు

-

అసెంబ్లీ ప్రశ్నోత్తరాల సమయంలో ఆలేరు ఎమ్మెల్యే గొంగడి సునీత కన్నీటి పర్యంతమయ్యారు. ప్ర‌స్తుతం తెలంగాణ అసెంబ్లీ స‌మావేశాలు జ‌రుగుతోన్న సంగ‌తి తెలిసిందే. ఈ క్ర‌మంలోనే ఈ సమావేశాల్లో యాదాద్రి జిల్లా ఆలేరు టీఆర్ఎస్ ఎమ్మెల్యే గొంగడి సునీత కన్నీటి పర్యంతమయ్యారు. సభలో ప్రశ్నోత్తరాల సమయంలో భాగంగా ఎమ్మెల్యే డయాలసిస్ వ్యాధిగ్రస్తుల బాధలను వివరిస్తూ ఉద్వేగానికిలోనై కన్నీరు పెట్టుకున్నారు.

ఈ సందర్భంగా గొంగడి సునీత మాట్లాడుతూ.. డయాలసిస్ పేషెంట్ల దీన పరిస్థితిని వివరించారు. డ‌యాల‌సిస్ పేషెంట్లు ప‌డే బాధ‌లు వ‌ర్ణ‌నాతీతం అని… వాళ్ల‌కు కూడా ఆస‌రా ఫించ‌న్ అంద‌జేయాల‌ని ఆమె ముఖ్య‌మంత్రిని కోరారు. ఎవ‌రైనా ఈ వ్యాధికి గురైతే ఆ కుటుంబం అంతా ప‌డే బాధ‌లు మామూలుగా ఉండ‌వ‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు.

ఈ క్ర‌మంలోనే ఆమె త‌న తండ్రి కూడా ఈ వ్యాధితోనే మృతి చెందిన‌ట్టు చెప్పారు. కుటుంబ పెద్ద ఈ వ్యాధి భారీన ప‌డితే అతను ఉపాధి కోల్పోవడంతోపాటు.. కుటుంబం అంతా మానసికంగా, ఆర్థికంగా నష్టపోతుందన్నారు. తన తండ్రి కూడా 14 ఏళ్లు డయాలసిస్ పెషెంట్‌గా ఉండటం వల్ల ఆర్థికంగా తామెంత చితికిపోయినమో, మేము ఎంత బాధపడ్డమో తనకు ప్రత్యక్షంగా తెలుసంటూ కన్నీటి పర్యంతమయ్యారు.

Read more RELATED
Recommended to you

Latest news