ఏపీలో ఓటమి భయాలు మొదలు.. ఆ ఓట్లకు డిమాండ్… నేతల క్యూ..!

-

పోలింగ్ ముగిసినా కూడా ప్రధాన పార్టీలు గెలుపుపై ఆశలు పెట్టుకోలేకపోతున్నాయి. గెలిచే, ఓడిపోయే అభ్యర్థుల మధ్య తేడా కూడా చాలా స్వల్పంగా ఉంటుందట.

ఏపీలో ఈసారి టైట్ ఫైటేనట. దీంతో ప్రధాన పార్టీల గుండెల్లో గుబులు స్టార్ట్ అయింది. ఈసారి ఎలాగూ టైట్ ఫైట్ అని తెలిసే ఓటర్లకు గాలం వేయడానికి ప్రధాన పార్టీలు వేయని ఎత్తుగడలు లేవు. తాజాగా తమ గెలుపోటములను నిర్ణయించే పోస్టల్ బ్యాలెట్లనూ కూడా ప్రధాన పార్టీలు వదలడం లేదు.

all party leaders are trying to buy postal ballot votes in ap

ప్రధాన పార్టీల మధ్య గట్టి పోటీ ఏర్పడితే… పోస్టల్ ఓట్లను తమవైపు తిప్పుకోగలిగామంటే ఎలాగైనా గట్టెక్కొచ్చనే ఆలోచనలో ప్రధాన పార్టీల అభ్యర్థులు ఉన్నారు. ఏపీలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఈసారి మాత్రం త్రిముఖ పోటీ అనే చెప్పాలి. ముందుగా.. టీడీపీ, వైఎస్సార్సీపీ మధ్యే పోటీ అనుకున్నా.. మధ్యలో వచ్చిన జనసేన కూడా బాగానే పోటి ఇచ్చిందట.

అందుకే… పోలింగ్ ముగిసినా కూడా ప్రధాన పార్టీలు గెలుపుపై ఆశలు పెట్టుకోలేకపోతున్నాయి. గెలిచే, ఓడిపోయే అభ్యర్థుల మధ్య తేడా కూడా చాలా స్వల్పంగా ఉంటుందట. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో అందరి చూపూ పోస్టల్ బ్యాలెట్లపై పడింది. అసలు.. పోస్టల్ బ్యాలెట్ల గురించి ఇప్పటి వరకు ఆలోచించని అభ్యుర్థులు ఇప్పుడు వాటిని కొనుగోలు చేయడానికి తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఏపీలో పోస్టల్ బ్యాలెట్ కోసం ఈసారి 4 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు.

వారిలో ఉద్యోగులు, అంగన్ వాడీ వర్కర్లు ఉన్నారు. 4 లక్షల మందిలో 60 శాతం మంది ఇప్పటికే తమ ఓట్లను పోస్టల్ విధానంలో ఎన్నికల అధికారులకు పంపించారు. మిగిలిన 40 శాతం మంది మాత్రమే కౌంటింగ్ తేదీ మే 23 కు ముందు రోజు వరకు ఓటు వేసే అవకాశం ఉంది. దీంతో ఎవరు పోస్టల్ బ్యాలెట్ కోసం దరఖాస్తు చేసుకున్నారో కనుక్కొని వారిని కొనే పనిలో ప్రధాన పార్టీలు పడ్డాయట.

ప్రధాన పార్టీల మధ్య గట్టి పోటీ ఉన్న నియోజకవర్గాల్లో మాత్రం పోస్టల్ బ్యాలెట్ ఓటుకు వెయ్యి నుంచి 5 వేల దాకా అభ్యర్థులు ముట్టజెప్పుతున్నారట. గోదావరి జిల్లాల్లో 2 వేలకు పైనే పలుకుతోందట ధర. గుంటూరు, ప్రకాశం జిల్లాల్లోనూ అంతే ధర ఉందట. ఇన్ని రోజులు ప్రచారాలు చేసి.. అది చేసి ఇది చేసి ఓటర్లకు గాలం వేసిన ప్రధాన పార్టీలు ఇప్పుడు పోస్టల్ బ్యాలెట్ కు దరఖాస్తు చేసుకున్న వాళ్లను వెతికే పనిలో పడ్డాయి. వాళ్లు ఎంత డిమాండ్ చేస్తే అంత ఇచ్చి తమ పార్టీకి ఓటేసేలా మలుచుకుంటున్నాయి పార్టీలు. చూద్దాం.. మరి పోస్టల్ బ్యాలెట్ అన్నా ప్రధాన పార్టీలకు కలిసొస్తుందో లేదో?

Read more RELATED
Recommended to you

Latest news