మళ్ళీ ఆ సీనియర్లు చేతులెత్తేస్తే…హస్తం పరిస్తితి అస్సామే…!

-

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీలో పేరుకు బలమైన నాయకులు ఉన్నారు గానీ…బలంగా లేరని చెప్పొచ్చు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో రాజకీయ ఉద్ధండులు ఉన్నారు. దశాబ్దాల పాటు ఆ పార్టీ కోసం పనిచేస్తున్న నాయకులు ఉన్నారు. అలాగే వారు అనేక గొప్ప విజయాలు కూడా సాధించారు. అయితే ఇదంతా 2014 ముందు వరకు అంటే తెలంగాణ రాక ముందు వరకు కాంగ్రెస్‌లో ఉన్న సీనియర్లు అంతా సత్తా చాటిన వారే. కానీ తెలంగాణ వచ్చిన దగ్గర నుంచి సీనియర్లు పరిస్తితి కాస్త ఇబ్బందుల్లో పడింది.

congress

కేసీఆర్ దెబ్బకు కాంగ్రెస్ సీనియర్లు ఎక్కడకక్కడ ఘోరంగా ఓడిపోతూ వస్తున్నారు. 2018 ఎన్నికల్లో అయితే దారుణంగా ఓడిపోయారు. ఏదో కొద్దిమంది మాత్రమే గెలవగలిగారు. అయితే వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌ని నిలబెట్టాల్సింది సీనియర్లు మాత్రమే. మెజారిటీ సీనియర్లు గెలిస్తే, కాంగ్రెస్‌కు బాగా కలిసొస్తుంది. అయితే ఇప్పటికే పలువురు సీనియర్లు కాంగ్రెస్‌ని వదిలి టీఆర్ఎస్‌లోకి వెళ్ళిన విషయం తెలిసిందే.

ఇక కొందరు నాయకులు కాంగ్రెస్‌లో ఉన్నారు…వారే ఇప్పుడు పార్టీని నిలబెట్టాలి. నెక్స్ట్ ఎన్నికల్లో వారు సత్తా చాటితే కాంగ్రెస్‌కు కొత్త ఊపు వచ్చినట్లే. కాంగ్రెస్‌కు కొత్త ఊపు తీసుకురావాల్సింది సీనియర్లు మాత్రమే..వాళ్ళ గెలుపే, కాంగ్రెస్ గెలుపు. అలా పార్టీని నిలబెట్టాల్సిన వారిలో మొదట పి‌సి‌సి చీఫ్ రేవంత్ రెడ్డి ఉన్నారు. గత ఎన్నికల్లో ఈయన కొండగల్ బరిలో ఓడిపోయిన విషయం తెలిసిందే. నెక్స్ట్ ఎన్నికల్లో కొడంగల్ బరిలో రేవంత్ తప్పనిసరిగా గెలవాల్సి ఉంది. ఇటు నల్గొండ అసెంబ్లీలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి, హుజూర్‌నగర్‌లో ఉత్తమ్ కుమార్ రెడ్డి, సూర్యాపేటలో రాంరెడ్డి దామోదర్ రెడ్డి, పరకాలలో కొండా సురేఖ, ఆందోల్‌లో దామోదర రాజనరసింహా, నాగార్జున సాగర్‌లో జానారెడ్డి, జగిత్యాలలో జీవన్ రెడ్డి..షబ్బీర్ అలీ, గీతారెడ్డి ఇలా సీనియర్ల అంతా సత్తా చాటాల్సి ఉంటుంది. నెక్స్ట్ సీనియర్లు కూడా చేతులెత్తేస్తే…హస్తం పరిస్తితి అస్సామే.

Read more RELATED
Recommended to you

Exit mobile version