ఎన్నికల వేళ అధికార టీడీపీకి షాక్స్ మీద షాక్స్ తగులుతున్నాయి. వైసీపీకి వలసల జోరు పెరుగుతోంది. తాజాగా అమలాపురం ఎంపీ రవీంద్రబాబు వైసీపీలో చేరారు. ఆయన వైసీపీలో చేరుతారని గత కొన్ని రోజులుగా ఊహాగానాలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. వాటన్నింటినీ నిజం చేస్తూ రవీంద్రబాబు ఇవాళ జగన్ సమక్షంలో వైఎస్సాఆర్సీపీ పార్టీలో చేరారు. ఈసందర్భంగా పార్టీ అధ్యక్షుడు జగన్ ఆయనకు పార్టీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.
వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ మోహన్ రెడ్డి సమక్షంలో పార్టీలో చేరిన అమలాపురం టీడీపీ ఎంపీ రవీంద్రబాబు.#YSRCP #YSJagan #RavindraBabu pic.twitter.com/VVdugLIOjZ
— YSR Congress Party (@YSRCParty) February 18, 2019
రవీంద్రబాబుకు టీడీపీ అధిష్టానం అమలాపురం ఎంపీ టికెట్ ఇవ్వడానికి నిరాకరించడంతోనే ఆయన వైసీపీలో చేరినట్టు తెలుస్తోంది. వైసీపీ నుంచి అమలాపురం ఎంపీ టికెట్ ను రవీంద్రబాబుకు ఇవ్వడానికి గ్రీన్ సిగ్నల్ రావడంతో ఆయన వైసీపీలో చేరారు.
ఇప్పటికే వైసీపీలో చేరిన ఎంపీల సంఖ్య రెండుకు చేరుకున్నది. అనకాపల్లి ఎంపీ అవంతి శ్రీనివాస్ కూడా ఇటీవలే వైసీపీలో చేరారు. అంతకుముందు రాజంపేట మాజీ ఎమ్మెల్యే మేడా మల్లిఖార్జునరెడ్డి, చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ కూడా వైసీపీలో చేరిన సంగతి తెలిసిందే.