రాయుడుతో రాజకీయం..పయనమెటు?

-

రాజకీయాల్లోకి అన్నీ వర్గాల వారికి ఎంట్రీ ఉంటుందనే చెప్పాలి. ఇక్కడ అందరికీ అవకాశాలు దక్కుతాయి..కేవలం రాజకీయ నేతలే కాదు..సినీ, వ్యాపార ప్రముఖులు సైతం రాజకీయాల్లో రాణిస్తూ ఉంటారు. అదే సమయంలో క్రీడాకారులు సైతం రాజకీయాల్లోకి వచ్చి రాణిస్తారు. ఇదే క్రమంలో తెలుగు తేజం అంబటి రాయుడు సైతం రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వడానికి రెడీ అవుతున్నారు. ఇటీవలే చెన్నై సూపర్ కింగ్స్ జట్టుతో ఐపీఎల్ కప్ గెలిచి..క్రికెట్‌కు పూర్తి స్థాయిలో వీడ్కోలు చెప్పేశారు.

ఇక నుంచి ఆయన రాజకీయాల్లోకి వచ్చి ప్రజలకు సేవ చేయాలని చూస్తున్నట్లు తెలిసింది. ఇటీవలే జగన్‌ని మెచ్చుకుంటూ ఆయన ట్వీట్ చేసిన విషయం తెలిసిందే. తాజాగా ఐపీఎల్ కప్ పెట్టుకుని జగన్‌ని కలిశారు. దీంతో ఆయన వైసీపీలో చేరిపోవడం ఖాయమైందని ప్రచారం జరుగుతుంది. రాయుడు వైసీపీలో చేరి గుంటూరు ఎంపీగా పోటీ చేస్తారని పెద్ద ఎత్తున ప్రచారం వస్తుంది. ఇక ఇందులో వాస్తవం ఎంతవరకు ఉందో తెలియడం లేదు. ఏదైనా రాయుడు చెబితేనే..పోలిటికల్ ఎంట్రీ పై క్లారిటీ వస్తుంది.

అదే సమయంలో రాయుడుని కాంగ్రెస్ లోకి సైతం ఆహ్వానిస్తున్నారని, తెలంగాణ కాంగ్రెస్ నేత, మాజీ క్రికెటర్ అజారుద్దీన్..రాయుడుని తెలంగాణ కాంగ్రెస్ లోకి తీసుకొచ్చి మల్కాజిగిరి ఎంపీ సీటు ఇప్పించాలని చూస్తున్నట్లు తెలిసింది. ఇక ఇటు తెలుగుదేశం పార్టీ సైతం రాయుడుకు ఆహ్వానాలు పంపుతుందని తెలిసింది. గతంలో రాయుడు తాత..టి‌డి‌పి సర్పంచ్ గా పనిచేశారట.

ఇక ఆ అంశాన్ని దృష్టిలో పెట్టుకుని ఆయన్ని టి‌డి‌పిలోకి ఆహ్వానిస్తున్నారని తెలిసింది. అలాగే రాయుడుకు గుంటూరు ఎంపీ సీటు ఆఫర్ చేస్తున్నట్లు సమాచారం. ఎలాగో గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ టి‌డి‌పిలో సరిగ్గా యాక్టివ్ గా ఉండటం లేదు. దీంతో రాయుడుకు ఆ సీటు ఇవ్వాలని చూస్తున్నారని తెలిసింది. ఇలా రాయుడు చుట్టూ రాజకీయం నడుస్తుంది. చివరికి ఆయన ఏ పార్టీలోకి వెళ్తారో చూడాలి.

Read more RELATED
Recommended to you

Exit mobile version