బిజెపి నేతలు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు మంత్రి హరీష్ రావు తెలంగాణ దశాబ్ది వేడుకలలో భాగంగా సిద్దిపేటలో నిర్వహించిన సంక్షేమ ఉత్సవాలకు మంత్రి హరీష్ రావు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ పాలనలో రాష్ట్రం సంక్షేమం దిశగా కొనసాగుతుందన్నారు. ఈ తొమ్మిదేళ్లలో 21 మెడికల్ కాలేజీలు తీసుకువచ్చామని.. వైద్య కళాశాలలు తెచ్చామని బిజెపి నాయకులు అబద్ధాలు చెబుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఆ పార్టీ నాయకుల తీరు సొమ్ము ఒకడిది.. సోకు మరొకడిది అన్నట్లు ఉందని విమర్శించారు. బిజెపికి చిత్తశుద్ధి ఉంటే విభజన హామీలు నెరవేర్చాలని సూచించారు. బండి సంజయ్ కరీంనగర్ కి మెడికల్ కాలేజీ తెచ్చాడా..? అని ప్రశ్నించారు. వెనుకబడిన జిల్లాలకు రావలసిన 1300 కోట్లను కిషన్ రెడ్డి ఇప్పించాలని డిమాండ్ చేశారు. బయ్యారంలో ఉక్కు ఫ్యాక్టరీ పెట్టాలని అన్నారు.