గ‌వ‌ర్న‌ర్ ప‌ద‌వి కావాలంటున్న ఆ ఇద్ద‌రు…చంద్ర‌బాబు ప్లానేంటి…?

-

కేంద్రంలో కొలువుదీరిన ఎన్‌డీఏలో తెలుగుదేశం పార్టీది కీల‌క‌పాత్ర‌.టీడీపీకి ఉన్న 16 మంది ఎంపీల‌తో ఎన్‌డీఏ ప్ర‌భుత్వం నిల‌బ‌డింది.ఈ క్ర‌మంలోనే అన్ని రంగాల్లో ఏపీకి కేంద్ర ప్ర‌భుత్వం అధిక ప్రాధాన్య‌త ఇస్తోంది.ప‌ద‌వుల‌తో పాటు నిధుల విడుద‌ల‌లోనూ కేంద్రం ఉదారంగా వ్య‌వ‌హ‌రిస్తోంది.ఇప్పుడు మ‌రో కీల‌క ప‌ద‌వి కూడా తెలుగుదేశం పార్టీకి ద‌క్క‌బోతున్న‌ట్లు స‌మాచారం అందుతోంది.ఇక త్వ‌ర‌లో ఒక‌రికి గ‌వ‌ర్న‌ర్ ప‌ద‌విని ఆఫ‌ర్ చేయాల‌ని కేంద్రంలోని బీజేపీ ఆలోచిస్తోంది. కేంద్రంలో మంచి ప్రాధాన్య‌మున్న ప‌ద‌వి కోస‌మే ఇద్ద‌రు సీనియ‌ర్‌లు నిరీక్షిస్తున్నారు.

ఇప్ప‌టికే వారి విజ్ఞ‌ప‌న కూడా అధినేత చంద్ర‌బాబుకి తెలియ‌జేశారు.అయితే ఆ ఇద్ద‌రిలో ఎవ‌రికి గ‌వ‌ర్న‌ర్ గిరి ద‌క్కుతుంద‌నేది ఆస‌క్తిక‌రంగా మారింది.పార్టీలో సీనియ‌ర్ అయిన అశోక్ గ‌జ‌ప‌తిరాజు,మ‌రో సీనియ‌ర్ య‌న‌మ‌ల రామ‌కృష్ణుడు కేంద్ర ప‌ద‌వుల‌ను ఆశిస్తున్నారు.చంద్ర‌బాబుకి ఆ ఇద్ద‌రు నేత‌లు కీల‌క‌మే. ఇద్దరూ చంద్ర‌బాబుకి సన్నిహితులు కావడంతో ఎవరి వైపు మొగ్గు చూపుతారో తెలియ‌డం లేదు.కేంద్రంలో టీడీపీ కీల‌కంగా ఉంది కాబ‌ట్టి ఈ ఇద్ద‌రి కోసం మ‌రో ప‌ద‌విని చంద్ర‌బాబు అడుగుతారా అనే చ‌ర్చ న‌డుస్తోంది.

తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి అశోక్ గ‌జ‌ప‌తిరాజు,య‌న‌మ‌ల రామ‌కృష్ణుడు ప‌నిచేస్తున్నారు.రాజ‌కీయంగా అనేక ప‌ద‌వుల‌ను అనుభ‌వించిన వారు ఇరువురు ఇప్పుడు గౌరవప్రదమైన రిటైర్మెంట్ ను కోరుకుంటున్నారు. వీరిద్ద‌రు చంద్రబాబుకు సమకాలీకులు. అత్యంత సన్నిహితమైన నాయకులు.ఈ ఇద్ద‌రికీ రాజ్యసభ పదవులు కానీ.. అంతకుమించి పదవులు ఇస్తారని ప్రచారం జరుగుతోంది. వారు కూడా దానికోసమే ఎదురు చూస్తున్నారు.అశోక్‌ గజపతిరాజు సుదీర్ఘ రాజకీయ నేపథ్యం ఉన్న నేత‌. ఈసారి ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకుని తన కుమార్తెను అసెంబ్లీకి పంపించారు.

Minister posts in TDP

అయితే అశోక్ గజపతి రాజుకు టీటీడీ చైర్మన్ పదవిని ఆఫర్ చేయ‌గా ఆయన సున్నితంగానే తిరస్కరించినట్లు సమాచారం.గ‌వ‌ర్న‌ర్ పదవితోనే తాను రాజకీయాలనుంచి శాశ్వతంగా తప్పుకుంటానని సన్నిహిత వర్గాల వ‌ద్ద చెప్పార‌ట‌.ఇక యనమల రామకృష్ణుడు ఆర్థిక శాఖ మంత్రిగా, శాసనసభ స్పీకర్ గా సేవలందించారు. టిడిపి క్లిష్ట సమయంలో ట్రబుల్ షూటర్ గా పని చేశారు. ఇప్పుడు ఆయ‌న కూడా హుందాగా రాజ‌కీయాల నుంచి త‌ప్పుకోవాల‌ని చూస్తున్నారు. చంద్రబాబు ఆయనకు రాజ్యసభ పదవి ఆఫర్ చేయ‌గా రామకృష్ణుడు ఆసక్తి చూపలేదని సమాచారం.త‌న‌కు గ‌వ‌ర్న‌ర్ గిరి కావాల‌ని ప‌ట్టు ప‌డుతున్నార‌ట‌.

టీడీపీలో కీల‌కంగా ఉన్న ఈ ఇద్ద‌రు నేత‌ల‌ను సంతృప్తి ప‌ర‌చాల‌నే ఉద్దేశ్యంతో చంద్ర‌బాబు పావులు క‌దుపుతున్నారు.వారు కోరుకున్న‌ట్లుగానే గ‌వ‌ర్న‌ర్ ప‌ద‌వి ఇప్పించి గౌర‌వించాల‌ని ఆలోచిస్తున్నారు.ఈ నేప‌థ్యంలో ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోడీని మ‌రోసారి క‌లిసి ఒక‌టి కాదు రెండు గ‌వ‌ర్న‌ర్ ప‌ద‌వులు కావాల‌ని విజ్ఞ‌ప్తి చేసేందుకు సిద్ధ‌మ‌వుతున్నార‌ని స‌మాచారం.ఆ మేర‌కు సీనియ‌ర్‌ల‌కు చంద్ర‌బాబు హామీ కూడా ఇచ్చార‌ని పార్టీ వ‌ర్గాల నుంచి తెలిసింది. వీరికి చిన్నా చితకా పదవులు ఇస్తే తీసుకునే ఛాన్స్ లేదు. అది హుందాగా ఉండదు కూడా.

అందుకే వీరి విషయంలో చంద్రబాబు ప్ర‌ధాని న‌రేంద్ర మోడీని ఒప్పించ‌డానికి సిద్ధ‌మ‌య్యారు.త్వ‌ర‌లోనే ఆయ‌న ఢిల్లీ ప‌ర్య‌ట‌నకు వెళ్ళ‌నున్నారు.రాష్ర్ట అభివృద్ధిలో కేంద్ర భాగ‌స్వామ్యాన్ని కోర‌డానికి వెళ్తున్న ఆయ‌న గ‌వ‌ర్న‌ర్ ప‌ద‌వుల అంశాన్ని కూడా ప్ర‌ధాని ముందు ఉంచేందుకు రెడీ అయ్యారు.ఎన్‌డీఏలో కీల‌కంగా ఉన్న చంద్ర‌బాబు మాట ప్ర‌ధాని వింటార‌నే ఆశిస్తున్నారు టీడీపీ సీనియ‌ర్‌లు.ఇక ప్ర‌ధాని ఒప్పుకుంటే ఆ ఇద్ద‌రినీ గ‌వ‌ర్న‌ర్లుగా చూసే టైమ్ ద‌గ్గ‌ర‌లోనే ఉంద‌న్న మాట‌.

Read more RELATED
Recommended to you

Exit mobile version