అవరావతి : ఇదివరకు పలువురు రాజకీయ నాయకుల వైరాలు, పలు యవ్వారాలకు సంబంధించిన ఆడియో టేపులు, వీడియో క్లిప్పింగ్‌లు ఇంటర్నెట్ లో కనిపించి తీవ్ర రాజకీయ దుమారం రేపిన సంగతి తెలిసిందే. తాజాగా రాజోలు ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ పేరుతో ఓ ఆడియో టేపు అంతర్జాలంలో తెగ హల్‌చల్ చేస్తూ.. వైరల్‌గా మారింది. ఏపీలో జరగబోయే స్థానిక ఎన్నికలకు సంబంధించిన ఓ అభ్యర్థి విషయంలో అధిరాక వైసీపీ కార్యకర్తను.. ఎవడ్రా నువ్వు.. వెధవ.. పోరంబోకు అంటూ దుర్భాషలాడారు.
ఈ ఆడియో టేపు తాజాగా యూట్యూబ్‌తో పాటు సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో తెగ హల్‌చల్ చేస్తోంది. ఆ ఆడియో టేపులో … పంచాయతీ ఎన్నికల్లో ఓ గ్రామ అభ్యర్థి ఎంపిక విషయంలో.. వైసీపీ కార్యకర్తను బండ బూతులు తిట్టినట్లుగా రాపాక పేరుతో ఓ ఆడియో టేప్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అందులో రాపాక ఓ వైసీపీ కార్యకర్తకు ఫోన్ చేసి హెచ్చరించారు. మా ఊర్లో వైసీపీ అభ్యర్థిని నిలబెట్టడానికి నువ్వు ఎవడ్రా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. నువ్వు నిర్ణయించావా? అన్ని ప్రశ్నించగా.. లేదన్నా.. అమ్మాజీ గారు నిర్ణయించారని ఆ కార్యకర్త చెప్పగా.. నా గ్రామానికి వచ్చి వైసీపీ అభ్యర్థిని ప్రెసిడెంట్‌గా గెలిపిస్తావా.. వైసీపీ వాళ్లంతా పోరంబోకులు తయారయ్యారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈ ఆడియో టేపు ప్రస్తుతం ఏపీలో రాజకీయ దుమారం రేపుతోంది. అయితే, అధికారికంగా ఈ టేపుపై రాపాక గానీ, వైసీపీ నేతలు గాని ఇంకా స్పందించలేదు. అయితే, అభ్యర్థుల ఎంపిక విషయంలో తనను పట్టించుకోకపోవడంతోనే రాపాక కార్యకర్తలపై ఇలా ఫైర్ అవుతున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి. కాగా, రాపాక 2019 ఎన్నికల్లో జనసేన నుంచి గెలిచిన.. అనంతరం వైసీపీకి దగ్గరైన సంగతి తెలిసిందే.