ఉద్యమాల పురిటి గడ్డగా ఉన్న తెలంగాణలో మరో కొత్త పార్టీ పురుడుపోసుకోబోతుందా..? దీనిపై కొందరు నేతలు గ్రౌండ్ వర్క్ రెడీ చేస్తున్నారా..? సామాజిక న్యాయమే లక్ష్యంగా ఆవిర్బవించబోయే పార్టీలో బఢా నేతలే ఉన్నారా..? వీటన్నింటికి అవుననే సమాధానమే వస్తోంది.. కొత్త పార్టీ పెట్టి బీసీలను ఏకం చెయ్యాలనే ఆలోచనలో కొందరు నేతలు ఉన్నారట.. ఇంతకీ జాతీయ పార్టీల హవాను కొత్త పార్టీ తట్టుకోగలదా..?
తెలంగాణలో ఎన్నికలు జరిగి ఏడాది కావస్తోంది.. అయితే వచ్చె ఎన్నికలే లక్ష్యంగా కొందరు నేతలు ఇప్పటి నుంచే పావులు కదుపుతున్నారు.. ఎన్నికల్లో అధికారమే లక్ష్యంగా కొత్తపార్టీ పెట్టబోతున్నారు.. బీసీల ఓటుబ్యాంకే లక్ష్యంగా.. కొత్త పార్టీ రాబోతుందనే ప్రచారం జరుగుతోంది.. తెలంగాణలో బలమైన రెండు జాతీయ పార్టీలతో పాటు.. బీఆర్ఎస్, పలు ప్రాంతీయ పార్టీలున్నాయి.. ఎవరికి వారు అధికారం కోసం పోరాడుతూనే ఉన్నారు.. ఈ నేపథ్యంలో తెలంగాణలో మరో కొత్త పార్టీ పురుడు పోసుకోబోతుందని.. ఆ దిశగా తెరవెనుక మంత్రాంగం జరుగుతోందన్న చర్చ పొలిటికల్ సర్కిల్ లో వినిపిస్తోంది.
ఎన్నికలకు ముందు, ఎన్నికల తర్వాత చాలా రాజకీయ పార్టీలు స్టేట్ లతో పుట్టుకొచ్చాయి.కొన్ని ఎన్నికల కోసమే పెడితే..మరికొన్ని ఆశయాల కోసం పనిచేశాయి.. సుమారు 100కి పైగా రాజకీయ పార్టీలున్నాయి..తెలంగాణలో బిజేపీ మినహా.. మిగిలిన ప్రధాన పార్టీలకు ప్రజలు అధికారాన్ని ఇచ్చారు.. అయితే మెజార్టీ జనాబా ఉన్న బీసీలు మాత్రం ఇంతవరకు సీఎం కాలేదు.. ఈ నినాదంతోనే కొత్తపార్టీ రాబోతుందని తెలంగాణలో చర్చ నడుస్తోంది..
ఈ కొత్తపార్టీల్లో అన్ని పార్టీలకు చెందిన బీసీ నేతలు చేరబోతున్నారని ప్రచారం ఊపందుకుంది.. అయితే కొత్త పార్టీ ఏర్పాటైయితే.. బలంగా ఉన్న బిజేపీని, అధికారంలోఉన్న కాంగ్రెస్ ను.. ప్రాంతీయవాదంతో పుట్టిన బీఆర్ఎస్ ను తట్టుకోగలదా అన్న ప్రశ్న కూడా ఉత్పన్నమవుతోంది.. బీసీ సీఎం మంత్రాన్ని బిజేపీ కూడా జపిస్తోంది.. ఈ క్రమంలో కొత్త పార్టీని బీసీలు నమ్ముతారో లేదో చూడాలి..